బ్యూటీపార్లర్‌కు వెళ్లొద్దన్న భర్త.. కోపంతో ఆ భార్య ఎంత పని చేసిందంటే ?

By Asianet News  |  First Published Apr 30, 2023, 7:45 AM IST

భర్త బ్యూటీపార్లర్ కు వెళ్లొద్దు అన్నాడని భార్య మనస్థాపం చెందింది. అనంతరం ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ లో చోటు చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 


వాళ్లిద్దరూ భార్య భర్తలు. ఇంట్లోనే కుట్టు పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. అనోన్యంగా సాగిపోతున్న వారి జీవితంలో ఒక చిన్న గొడవ విషాదాన్ని నింపింది. ఒక రోజు భార్య బ్యూటీపార్లర్ కు వెళ్తానని భర్తకు చెప్పింది. దీనికి భర్త నిరాకరించాడు. దీంతో వారి మధ్య గొడవ జరిగింది. ఈ విషయంలో మనస్థాపం చెందిన భార్య ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మధ్యప్రదేశ్ లో జరిగింది. 

హన్మకొండలో ఘోరం.. ఇంట్లో గొడవపడి బయటకు వచ్చిన వివాహిత.. ముగ్గురు వ్యక్తులు ఆటోలో బలవంతంగా ఎక్కించుకొని..

Latest Videos

వివరాలు ఇలా ఉన్నాయి. ఇండోర్‌లోని స్కీమ్ నంబర్ 51 ప్రాంతానికి చెందిన బలరామ్ యాదవ్‌ -రీనా యాదవ్‌ (34) దంపతులు. ఇద్దరూ ఇంటి వద్దనే టైలరింగ్ చేస్తూ జీవిస్తున్నారు. గత గురువారం తాను బ్యూటీ పార్లర్ కు వెళ్లి వస్తానని రీనా.. తన భర్తకు తెలిపింది. ఆమె కోరికను భర్త ఒప్పుకోలేదు. బ్యూటీపార్లర్ కు వెళ్లొద్దని చెప్పాడు. దీంతో ఇరువురి మధ్య గొడవ జరిగింది.

తెలంగాణ కొత్త స‌చివాల‌యం నిర్మాణం వెనుకున్న క‌థేంటో తెలుసా..?

ఈ గొడవ తీవ్ర వాగ్వాదంగా మారింది. భర్త ప్రవర్తనతో భార్య మనస్థాపం చెందింది. ఇంట్లోని ఓ గదిలోకి వెళ్లి తలుపులు మూసుకుంది. లోపలే ఆత్మహత్యకు పాల్పడింది. భర్త వెళ్లి ఎన్నిసార్లు తలుపుకొట్టినా ఆమె తీయలేదు. లోపలి నుంచి ఎలాంటి సౌండ్ రాకపోవడంతో, ఇక లాభం లేదనుకొని ఆయన తలుపుపగుల గొట్టాడు. దీంతో భార్య విగతజీవిగా కనిపించింది. ఈ ఘటనపై సమాచారం అందగానే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. డెడ్ బాడీని పోస్టుమార్టం నిమిత్తం పోలీసు స్టేషన్ కు తీసుకెళ్లారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

అతిక్ అహ్మద్ లాగే నన్నూ చంపేస్తారని భయమేస్తోంది - యూపీ సమాజ్ వాదీ పార్టీ సీనియర్ నేత ఆజంఖాన్

ఆత్మ‌హ‌త్య అన్ని స‌మస్య‌ల‌కు ప‌రిష్కారం కాదు. ఆత్మ‌హ‌త్య‌తో ఎవ‌రూ ఏమీ సాధించ‌లేరు. ఆత్మ‌హ‌త్య చేసుకోవాల‌నే ఆలోచ‌న వ‌స్తే వెంట‌నే 9152987821 అనే ప్ర‌భుత్వ హెల్ప్ లైన్ నెంబ‌ర్ కు కాల్ చేయండి. వారు మంచి కౌన్సిలింగ్ ఇచ్చి మీకు స‌హాయం చేస్తారు. 
 

click me!