
సోషల్ మీడియాలో ప్రతీ రోజు ఎన్నో విషయాలు వైరల్ అవుతుంటాయి. కొన్ని సార్లు ఫొటోలు, మరి కొన్ని సార్లు వీడియోలు, ఇంకొన్ని సార్లు మోటివేషన్ స్టోరీలు.. ఇలా ఏదో ఒక టాపిక్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూ ఉంటాయి. తాజాగా అలాంటి ఓ స్టోరీయే ఇప్పుడు తెగ చక్కర్లు కొడుతోంది. అందులో ఏముందంటే ?
వెంకయ్య నాయుడును ఉప రాష్ట్రపతి చేసినప్పుడు కలత చెందాను.. రజినీకాంత్ కీలక వ్యాఖ్యలు..
ఆమె ఓ జిల్లాకు కలెక్టర్ గా పని చేస్తున్నారు. చిన్నప్పటి నుంచి పేదరికంలో పెరిగారు. వారిది మధ్య తరగతి కుటుంబం. ఎంతో కష్టపడి చదుకునేది. పదో తరగతికి చేరుకుంది. మంచి మార్కులతో పాసైతే హోటల్ లో దోషలు తినిపిస్తానని తండ్రి ఆమెకు మాటిచ్చాడు. దీంతో మరింత ఉత్సాహంతో ఆమె కష్టపడి చదివింది. తండ్రి కోరుకున్నట్టుగానే ఆమె ఫస్ట్ క్లాస్ లో పాసైంది. మాట ప్రకారం తండ్రి ఓ మంచి హోటల్ కు తీసుకెళ్లాడు. కానీ తండ్రి వద్ద ఆ సమయంలో కేవలం ఒక దోషకు సరిపోయే డబ్బులు మాత్రమే ఉన్నాయి.
అయితే ఈ విషయంలో ఆ హోటల్ లో పని చేసే సర్వర్ కు తెలిపారు. తండ్రీ కూతుర్లను చూసి ఓ వెయిటర్ కరిగిపోయాడు. వారి పరిస్థితిని వెంటనే హోటల్ ఓనర్ కు చెప్పాడు. అతడు కూడా చలించిపోయాడు. వారిద్దరికి స్పెషల్ గా ఓ టేబుల్ ఏర్పాటు చేయించాడు. వారికి దోషలతో పాటు రుచికరమైన ఐటమ్స్ ను చేయించి పెట్టించాడు.
ఫుల్లుగా తాగి పెళ్లి పీటలెక్కిన వరుడు.. కూర్చున్న చోటనే తూలుతూ నిద్రలోకి.. తరువాత ఏమైందంటే ?
సీన్ కట్ చేస్తే.. ఆమె ఎంతో కష్టపడి చదివి తరువాతి కాలంలో ఐఏఎస్ ఆఫీసర్ అయ్యారు. పదో తరగతి సమయంలో దోషలు తిన్న హోటల్ ఉన్న జిల్లాకే కలెక్టర్ హోదాలో వచ్చారు. చిన్నప్పుడు జరిగిన విషయాన్ని గుర్తుపెట్టుకొని, ఆ హోటల్ ఓనర్ కు థ్యాంక్స్ చెప్పాలని నిర్ణయించింది. అనుకున్నదే తడవుగా ఆమె హోటల్ కు వచ్చి, పదో తరగతి సమయంతో జరిగిన సంఘటనను గుర్తు చేస్తూ ఓనర్ ను షాలువాతో సత్కరించింది. దీంతో ఆమె సింప్లిసిటీని అందరూ మెచ్చుకున్నారు. ఇదే వార్త సోషల్ మీడియాలో ప్రస్తుతం హల్ చల్ చేస్తోంది.
కారణమిదీ: ఈడీ స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నితీష్ రాజీనామా
ఈ విషయం చివరికి ఆ కలెక్టర్ గా దాకా చేరింది. కానీ ఇదంతా ఫేక్ అని ఆ కలెక్టర్ తేల్చిపారేసింది. ఆ కలెక్టర్ పేరు స్వాతి మీనా నాయక్. మధ్యప్రదేశ్ కేడర్ కు చెందినది. 2007 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్. ప్రస్తుతం సోషల్ మీడియాలో తన గురించి జరుగుతున్న చర్చ అంతా అబద్దమని ఆమె ఫేస్ బుక్ ద్వారా తేల్చి చెప్పారు. తమది మధ్యతరగతి కుటుంబ కాదని, చిన్నప్పటి నుంచి తనకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులూ లేవని ప్రకటించారు. తండ్రి ప్రభుత్వ ఉన్నతోద్యోగి అని, తన తల్లి బిజినెస్ ఉమెన్ అని తెలిపారు. తన భర్త కూడా ఐఏఎస్ ఆఫీసర్ అని చెప్పారు. తన పేరుపై సోషల్ మీడియాలో జరుగుతున్నదంతా కట్టు కథే అని వివరించారు.