
మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలో సమృద్ధి ఎక్స్‌ప్రెస్‌వేపై ఆదివారం ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కారు టైర్ పేలడంతో అందులో ప్రయాణిస్తున్న ఆరుగురు దుర్మరణం చెందారు. ప్రమాదానికి గురైన మారుతి ఎర్టిగా కారు.. ఔరంగాబాద్ నుంచి షెగావ్‌కు వెళ్తుండగా పిసా గ్రామం వద్ద ఉదయం 8 గంటలకు ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. కారులో ఆరుగురు వ్యక్తులు మరణించారని చెప్పారు. ప్రమాదానికి కారు టైరు పేలడమే ప్రాథమిక కారణంగా తెలుస్తోందని తెలిపారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.