విషాదం.. భగత్ సింగ్ ఉరి సీన్ రిహార్సల్స్ చేస్తూ.. నిజంగానే ఉరేసుకున్న బాలుడు.. ఎక్కడంటే ?

By team teluguFirst Published Oct 31, 2022, 10:13 AM IST
Highlights

కర్ణాటకలో విషాదం చోటు చేసుకుంది. భగత్ సింగ్ నాటకంలో భాగంగా ఉరి సీన్స్ రిహార్సల్స్ చేస్తూ.. అనుకోకుండా నిజంగానే ఉరి వేసుకున్నాడు. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో బాలుడిని కాపాడలేకపోయారు. 

కర్ణాటకలో విషాదకరమైన ఘటన చోటు చేసుకుంది. స్కూల్ లో భగత్ సింగ్ నాటకం వేయాలని అనుకున్న బాలుడు ఇంట్లో పలు సీన్ లను రిహార్సల్స్ చేశాడు. అందులో భాగంగానే భగత్ సింగ్ ఉరి వేసుకొనే సీన్ రిహార్సల్స్ చేస్తుండగా ప్రమాదవశాత్తూ మరణించాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

జగన్ కు సాయపడం కంటే.. అలా చేస్తే బాగుండేది.. ప్రశాంత్ కిశోర్

బాలుడి తండ్రి, పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. కర్ణాటకలోని కెలాగోటే బడవనే ప్రాంతంలో తిప్పాజీ సర్కిల్ సమీపంలో నాగరాజ్, భాగ్యలక్ష్మి దంపతులు నివాసం ఉంటున్నారు. వారికి 12 ఏళ్ల సంజయ్ గౌడ అనే కుమారుడు ఉన్నాడు. బాలుడు స్థానికంగా ఉన్నఎస్ఎల్వీ స్కూల్ లో ఏడో తరగతి చదువుతున్నాడు. అయితే మంగళవారం నాటి రాజ్యోత్సవ వేడుకలను పురస్కరించుకుని పాఠశాల సాంస్కృ తిక కార్యక్రమం కోసం బాలుడు భగత్ సింగ్ ప్రధాన పాత్రను పోషించాల్సి ఉంది.

పామును కరిచిందని..వెంటాడి, పట్టుకుని కొరికి చంపేశాడు..

దీని కోసం బాలుడు శనివారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో రిహార్సల్స్ చేయడం ప్రారంభించారు. ఆ నాటకంలో భగత్ సింగ్ ను ఉరి వేసే సీన్ ను ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో ప్రదవశాత్తూ ఉరిలో చిక్కుకున్నాడు. దీంతో బాలుడు మరణించాడు. ఆ బాలుడి అరుపులు విని ఇరుగుపొరుగు వారు ఇంటికి పరుగెత్తుకుంటూ వచ్చారు. అయితే ఇంటికి తాళం వేసి ఉండటంతో ఎలాంటి ఫలితం లేకపోయింది. కిటికీలో నుంచి చూడగా.. అప్పటికే బాలుడు చనిపోయి కనిపించాడు. దీంతో వారు తల్లిదండ్రులకు సమాచారం అందించారు.

గుజరాత్ లో కేబుల్ బ్రిడ్డి ప్రమాదం.. ఫిట్ నెస్ సర్టిఫికెట్ పొందకుండానే సందర్శకుల అనుమతి..

అనంతరం తల్లిదండ్రులు వచ్చి తలుపులు తెరిచారు. వెంటనే సంజయ్ గౌడ ను హాస్పిటల్ కు తరలించారు. కానీ అప్పటికే బాలుడు చనిపోయినట్టు డాక్టర్లు నిర్ధారించారు. ఈ ఘటనపై ఎస్ఎల్వీ స్కూల్ ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. తాము విద్యార్థిని భగత్ సింగ్ పాత్రలో నటించాలని అడగలేదని చెప్పారు. అయితే రాజ్యోత్సవ సందర్భంగా ఫ్యాన్సీ డ్రెస్ పోటీల్లో ఆసక్తి ఉన్న విద్యార్థులు పాల్గొనాలని సూచించామని తెలిపారు. కన్నడ అభివృద్ధికి, దాని గొప్ప సంస్కృతికి, వారసత్వా నికి కృషి చేసిన ప్రముఖుల పాత్రను పోషించవచ్చని చెప్పామని ఆయన ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’తో పేర్కొన్నారు. ‘‘ బాలుడి మరణంతో మేము చాలా బాధపడ్డాం. అతడు భగత్ సింగ్ పాత్రను ఎందుకు రిహార్సల్ చేస్తున్నాడో మాకు తెలియదు ’’ అని తెలిపారు. కాగా.. ఈ ఘటనపై సంజయ్ తండ్రి నాగరాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇది ప్రమాదశాత్తూ జరిగిందనీ, దీనికి ఎవరూ బాధ్యులు కారని అందులో పేర్కొన్నారు.

click me!