
తాగోబోతు వరుడు తనకొద్దని పెళ్లిని రద్దు చేసింది ఓ యువతి. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది. మరి కాసేపట్లో వరుడు వధువు మెడలో తాళి కట్టబోతున్న సమయంలో పెళ్లి కూతురు ఇలా చేయడం అందరిని షాక్ కు గురి చేసింది. కానీ ఆ వధువు చేసిన పనిలో తప్పు లేకపోవడంతో అందరూ ఆమెకే మద్దతు తెలిపారు. చివరికి ఇరువురి తరఫు బంధువులు పెళ్లి చూడకుండానే వెనుదిరిగారు.
ట్యూషన్ క్లాసులు చెప్పేందుకు ఆర్థిక సాయం చేస్తానని టీచర్ పై అత్యాచారం.. అసహజ శృంగారం..
ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసి జిల్లా చౌబేపుర్ పోలీస్ స్టేషన్ ఓ గ్రామానికి చెందిన యువకుడికి స్థానికంగా ఉండే మరో గ్రామానికి చెందిన యువతితో పెద్దలు పెళ్లి నిశ్చయించారు. వీరి పెళ్లికి ఆదివారం రాత్రి ఘనంగా ఏర్పాట్లు చేశారు. అదే రోజు సాయంత్ర పెళ్లి కొడుకు, అతడు తరుఫు బంధువులు కల్యాణ మండపానికి ఊరేగింపుగా చేరుకున్నారు. తరువాత పెళ్లి కొడుకు తన స్నేహితుల కలిసి మద్యం సేవించాడు.
దారుణం.. 13 ఏళ్ల బాలికను అపహరించి, అత్యాచారం.. ఆపై 15 మందికి విక్రయం.. ఏటా ఇద్దరితో బలవంతంగా వివాహం
కొంత సమయం తరువాత పెళ్లి పీటలపైకి ఎక్కి కూర్చున్నాడు. పురోహితుడు పూజ కార్యక్రమాలు నిర్వహించాడు. కాసేపు అయిన తరువాత పెళ్లి కూతురు కూడా మండపానికి వచ్చింది. పెళ్లి పీటలపై కూర్చుకుంది. ఆమెతో పురోహితుడు పూజా కార్యక్రమాలు చేయిస్తుండగా.. వరుడి స్నేహితులు వధువు స్నేహితుల ను చూసి కేకలు వేశారు. దీనిని ఆమె గమనించింది. అక్కడున్న బంధువులు కూడా చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు.
'వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయను..ప్రధాని రేసులో లేను' : శరద్ పవార్ సంచలన నిర్ణయం
అయితే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మెడలో పూల దండ వేయబోతుండగా.. అతడు కూడా తాగి ఉన్నట్టు ఆమె గమనించింది. దీంతో ‘ఆగండి’ అని ఒక్క సారిగా చెప్పింది. మండపంపై నుంచి కిందికి తిగి ఫంక్షన్ హాల్ లో తన కోసం కేటాయించిన గదిలోకి వెళ్లిపోయింది. తాను ఈ పెళ్లి చేసుకోబోనని, జీవితాంతం ఇలాంటి వ్యక్తితో కలిసి ఉండలేనని వారికి చెప్పింది. అయితే పెద్దలు ఆమెను ఒప్పించేందుకు ప్రయత్నించారు. కానీ ఆమె వినలేదు. చివరికి రెండు కుటుంబాలు ఈ పెళ్లి రద్దు చేసుకోవాలని నిర్ణయించుకున్నాయి. తరువాత ఇరువురి తరుఫు బంధువులు కల్యాణ మండపం నుంచి ఇంటికి వెళ్లిపోయారు.