చైనా సరిహద్దు సమస్యపై చర్చకు నిరాకరించిన ప్రభుత్వం.. రాజ్యసభను బహిష్కరించిన విపక్షాలు

By team teluguFirst Published Dec 22, 2022, 1:56 PM IST
Highlights

పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా గురువారం ప్రారంభమైన రాజ్యసభ కార్యకలాపాలను ప్రతిపక్షాలు బహిష్కరించాయి. సభ ప్రారంభమైన వెంటనే ప్రతిపక్ష సభ్యులు చైనా సరిహద్దు సమస్యపై చర్చ జరగాలని డిమాండ్ చేశారు. కానీ దీనికి ప్రభుత్వం అనుమతించలేదు. 

చైనా సరిహద్దు సమస్యపై సభలో చర్చను అనుమతించకపోవడంతో కాంగ్రెస్ నేతృత్వంలో ప్రతిపక్షాలు రాజ్యసభను గురువారం బహిష్కరించాయి. సెషన్‌లో అంతకు ముందు బీహార్‌పై సభా నాయకుడు పీయూష్ గోయల్ చేసిన కొన్ని వ్యాఖ్యలపై సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు.

తప్పతాగిన వ్యక్తి పబ్లిక్ ప్లేస్‌లో మూత్రించకుండా అడ్డుకున్న పోలీసు.. కత్తితో దాడికి దిగిన మందుబాబు

ఉదయం సెషన్‌ (జీరో అవర్)లో ప్రతిపక్షాలు నిలబడి నిరసన వ్యక్తం చేశాయి. చైనాతో సరిహద్దు వివాదంపై చర్చ జరగాలని డిమాండ్ చేశాయి. గోయల్ చేసిన వ్యాఖ్యలు బీహార్‌కు అవమానకరమని ఖండించాయి. కాగా.. నిరసన వ్యక్తం చేస్తున్న సభ్యులను కూర్చోవాలని రాజ్యసభ చైర్మెన్ జగదీప్ ధన్‌ఖర్ పదే పదే విజ్ఞప్తి చేశారు. కానీ ఎంపీలు నిరసనను విరమించకుండా నినాదాలు చేస్తూనే ఉన్నారు.

‘‘మేము మొదటి రోజు నుండి చైనాతో సరిహద్దు వివాదంపై చర్చకు డిమాండ్ చేస్తున్నాం. కానీ ప్రభుత్వం మొండిగా ఉంది. మొత్తం విపక్షాలు ఈ రోజు మొత్తం సభను బహిష్కరించాలని నిర్ణయించుకున్నాయి’’ అని కాంగ్రెస్ నాయకుడు కేసీ వేణుగోపాల్ వార్తా సంస్థ ‘పీటీఐ’కి తెలిపారు. 

సభలోనూ మాస్కులు ధరించాలి: రాజ్యసభ చైర్మన్ జగదీప్

సభా నాయకుడు తన వ్యాఖ్యల ద్వారా బీహార్‌ను, ఆ రాష్ట్రంలో నివసిస్తున్న మిలియన్ల మంది ప్రజలను కూడా ప్రతిపక్ష నాయకులు విమర్శించారు. చైనాపై చర్చ జరగాలని, బీహార్‌పై చేసిన వ్యాఖ్యలకు పీయూష్ గోయల్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అనంతరం సభను బహిష్కరించారు. 

కాగా..  అదనపు ఖర్చులకు పార్లమెంటు ఆమోదం కోరుతూ ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా మంగళవారం మాట్లాడారు. అయితే దీనికి స్పందించిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ..‘‘ఇంకా బాస్ చలే తో దేశ్ కో బీహార్ బనా దే (వారి ఇష్టానుసారం జరిగితే దేశం మొత్తం బీహార్ అవుతుంది) అని అన్నారు.

మ‌ళ్లీ క‌రోనా పంజా: అప్ర‌మ‌త్త‌మై రాష్ట్రాలు.. కోవిడ్ మార్గ‌ద‌ర్శ‌కాలు త‌ప్ప‌నిస‌రి చేస్తూ ఉత్త‌ర్వులు

దీనిపై ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడ్డాయి. ఇదే విషయంపై ఎంపీ మనోజ్ ఝా రాజ్యసభ చైర్మన్ జగ్‌దీప్ ధన్‌ఖర్‌కు లేఖ రాశారు. బీహార్‌ను కించపరిచినందుకు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. బీహారీలను రెండో తరగతి పౌరులుగా పరిగణిస్తున్నారని ఈ దీర్ఘకాలిక పక్షపాతాలను అధిగమించడానికి జాతీయ ఆందోళన, సానుభూతి అవసరమని తెలిపారు. 
 

click me!