తప్పతాగిన వ్యక్తి పబ్లిక్ ప్లేస్‌లో మూత్రించకుండా అడ్డుకున్న పోలీసు.. కత్తితో దాడికి దిగిన మందుబాబు

By Mahesh KFirst Published Dec 22, 2022, 1:47 PM IST
Highlights

ముంబయిలో ఓ వ్యక్తి తప్పతాగి బహిరంగంగా మూత్రం విసర్జించడానికి ఉపక్రమించాడు. అక్కడి ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటే పోలీసు కలుగజేసుకున్నాడు. ఓపెన్ ప్లేస్‌లో మూత్రం చేయరాదని, లేదంటే లీగల్ యాక్షన్ తీసుకుంటా అని బెదిరించాడు. తొలుత అతని వార్నింగ్ లైట్ తీసుకున్నా.. ఆ తర్వాత చిన్న కత్తి తీసి పోలీసుపై అటాక్ చేశాడు.
 

ముంబయి: మహారాష్ట్రలో ఓ వ్యక్తి తప్పతాగి బహిరంగ ప్రాంతంలో మూత్ర విసర్జన చేశాడు. ఆ సమయంలో అతడిని చూసిన జనం ఏమీ అనుకున్నా.. ఎవరికి వారు ముఖం చాటేసి వెళ్లిపోయారు. అక్కడే ఓ పోలీసు అధికారి ఉన్నారు. ఇదంతా గమనించి ఆ తాగుబోతు దగ్గరకు వెళ్లి అక్కడ బహిరంగంగా మూత్రం చేయరాదని ఆదేశించాడు. దీంతో ఫుల్‌గా తాగి మత్తులో ఉన్న వ్యక్తి ఏకంగా పోలీసు పైనే దాడికి పాల్పడ్డాడు. కత్తి తీసి ఆ పోలీసు పై దాడి చేశాడు. ఈ ఘటన ముంబయిలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది.

కందీవలి ఏరియాలో రాత్రి పూట రామ్ గోండే అనే వ్యక్తి లిక్కర్ తప్పతాగి నడుచుకుంటూ వెళ్లుతున్నాడు. ఫుల్లుగా తాగి ఉండటంతో చుట్టుపక్కల వాతావరణంపై ఆయనకు పట్టింపు లేకుండా పోయింది. బహిరంగంగానే మూత్ర విసర్జనకు ఉపక్రమించాడు. ఇది గమనించి అక్కడే ఉన్న కొందరు ఇబ్బందిపడ్డారు. సిగ్గుతో ముఖం చాటేసి ఎడంగా వెళ్లిపోయారు. కాగా, కాందివలీ పోలీసు స్టేషన్‌కు చెందిన పోలీసు ఉదయ్ కాదమ్ అక్కడే ఉన్నాడు. ఇదంతా గమనించి వెంటనే ఆ తాగిన వ్యక్తి వద్దకు వెళ్లాడు. బహిరంగ ప్రదేశంలో మూత్ర విసర్జన చేయరాదని అడ్డుకున్నాడు.

Also Read: మధ్యప్రదేశ్‌లో మళ్లీ పోలీసులపై దాడి.. ముగ్గురికి గాయాలు

తొలుత ఆ తాగుబోతు పోలీసు ఆదేశాలను లెక్కచేయలేదు. కానీ, పోలీసు సీరియస్ అయ్యారు. తన ఆదేశాలను ధిక్కరిస్తే లీగల్ యాక్షన్ తీసుకుంటా అని వార్నింగ్ ఇచ్చాడు. దీంతో నిందితుడు తన వద్ద నుంచి ఓ చిన్న కత్తిని బయటకు తీశాడు. ఆ పోలీసుపై దాడి చేశాడు.

ఆ వెంటనే కాందివలి పోలీసు స్టేషన్ నుంచి పోలీసులు స్పాట్‌కు వచ్చారు. ఆ నిందితుడిని అరెస్టు చేశారు. గాయపడిన పోలీసును సమీప హాస్పిటల్‌కు తీసుకెళ్లారు.

click me!