కేరళ యూనివర్సిటీ ల్లో గవర్నర్ అధికారాలకు కత్తెర వేసేందుకు అడుగులు.. అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టిన ప్రభుత్వం

By team teluguFirst Published Dec 9, 2022, 2:47 PM IST
Highlights

కేరళ యూనివర్సిటీల్లో గవర్నర్ కు అధికారికంగా సంక్రమించిన అధికారాలకు కత్తెర వేయాలని ఆ రాష్ట్ర వామపక్ష ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా యూనివర్సిటీల నుంచి ఛాన్సలర్ గా గవర్నర్ ను తొలగించేందుకు అసెంబ్లీలో ప్రభుత్వం బిల్లు ప్రవేశపెట్టింది. 

కేరళ ప్రభుత్వం, గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ మధ్య వివాదం మరింత ముదురుతోంది. ఆ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్న నేపథ్యంలో కేరళ అసెంబ్లీ విశ్వవిద్యాలయ చట్టాల (సవరణ) బిల్లును ప్రవేశపెట్టింది. రాష్ట్ర విశ్వవిద్యాలయాల ఛాన్సలర్ పదవి నుంచి గవర్నర్ ను తొలగించే ప్రయత్నంగా ఈ బిల్లును రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.

ప్రస్తుతం ఉన్న రాష్ట్ర చట్టాల ప్రకారం గవర్నర్ అన్ని రాష్ట్ర విశ్వవిద్యాలయాలకు ఛాన్సలర్ గా ఉన్నారు. దీనిని మార్చేందుకు రూపొందించిన బిల్లును కేరళ న్యాయ మంత్రి పి. రాజీవ్ రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అయితే సుప్రీంకోర్టు తీర్పు, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, యూజీసీ నిబంధనలకు విరుద్ధంగా ఈ బిల్లు ఉందని విపక్షాలు ఆరోపించాయి.

పెళ్లి బారాత్‌ మొదలుపెడుతుండగా పేలిన గ్యాస్ సిలిండర్.. ఐదుగురు దుర్మరణం.. 50 మందికి గాయాలు

తాజా బిల్లు ప్రకారం.. సైన్స్, సోషల్ సైన్స్, అగ్రికల్చర్, వెటర్నరీ సైన్స్, టెక్నాలజీ, మెడిసిన్, హ్యుమానిటీస్, సాహిత్యం, కళ, సంస్కృతి, చట్టం లేదా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ రంగాలలో ఉన్నత పేరున్న విద్యావేత్తను కేరళ ప్రభుత్వం ఛాన్సలర్ గా నియమిస్తుంది. ఛాన్సలర్ పదవీ బాధ్యతలు స్వీకరించిన తేదీ నుండి 5 సంవత్సరాల పదవీకాలాన్ని కలిగి ఉంటారని బిల్లు పేర్కొంది. ఛాన్సలర్ తన పదవిని పూర్తి చేసిన తరువాత మరో సారి కూడా నియమితమయ్యేందుకు కూడా అర్హత ఉంటుంది. అయితే బిల్లులోని విషయాలపై ప్రతిపక్షం తమ అభ్యంతరాలను వ్యక్తం చేసింది. 

సీఎం రేసులో ఆ ముగ్గురు.. ఉత్కంఠ భరితంగా హిమాచల్‌ప్రదేశ్‌ రాజకీయాలు..

‘‘ ఈ బిల్లులో ఛాన్సలర్ వయోపరిమితి, కనీస విద్యార్హతల గురించి ప్రస్తావించలేదు. అంటే ప్రభుత్వం వారి మనస్సుకు అనుగుణంగా ఎవరినైనా ఉన్నత పదవిలో నియమించవచ్చు. ఇది విశ్వవిద్యాలయాల స్వయంప్రతిపత్తిని నాశనం చేస్తుంది. వాటిని కేవలం ప్రభుత్వ విభాగాలుగా మారుస్తుంది’’ అని ప్రతిపక్ష నాయకుడు వీ డీ సతీశన్ అన్నారు. ప్రభుత్వం హడావిడిగా ఈ బిల్లును సిద్ధం చేసిందని చెప్పారు. యూనివర్సిటీలను కాషాయమయం చేసేందుకు గవర్నర్లు ప్రయత్నిస్తున్నారని మీరు (వామపక్షాలు) తరచూ చెబుతున్నారని, ఇప్పుడు ప్రతిపాదిత బిల్లుతో వామపక్ష ఆలోచనగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. అయితే, కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ అభ్యంతరాలను న్యాయ మంత్రి రాజకీయంగా తోసిపుచ్చారు. దీంతో ఈ బిల్లు ఇప్పుడు కేరళ శాసనసభ సబ్జెక్ట్ కమిటీకి వెళ్లనుంది. డిసెంబర్ 13న అసెంబ్లీలో మళ్లీ చర్చకు వచ్చి వెంటనే ఆమోదం పొందే అవకాశం ఉంది. 

కొలీజియం నిర్ణయాలను వెల్లడించలేం.. అది ఆర్టీఐ పరిధిలోకి రాదు: సుప్రీంకోర్టు

కాగా.. కేరళ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ కు, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య గత కొంత కాలంగా వివాదం నెలకొంది. పలు యూనివర్సిటీలకు చెందిన వైస్ ఛాన్సలర్ లను రాజీనామా చేయాలని డిమాండ్ చేయడంతో పాటు రాష్ట్ర విశ్వవిద్యాలయాలకు చెందిన 11 మంది వైస్ ఛాన్సలర్ల నియామకాన్ని రద్దు చేయడంతో వివాదం తీవ్రమైంది.  వీసీల నియామకానికి అభ్యర్థుల సరైన జాబితా తనకు పంపలేదని, ప్రభుత్వ సిఫారసుల ఆధారంగా నియామకాలు జరిగాయని ఖాన్ ఆరోపించారు.

అయితే శాసన నిబంధనల ప్రకారం ఓ బిల్లు చట్టంగా మారడానికి అన్ని గవర్నర్ సంతకం అవసరం. కాబట్టి ఈ బిల్లు కూడా గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్‌ వద్దకు వెళ్లనుంది. అయితే తనకు విరుద్ధంగా అనిపించిన ఏ అంశంపైనా తాను సంతకం చేయబోనని ఖాన్ ఇది వరకే తెలిజేశారు. కాబట్టి ఈ బిల్లు రాష్ఠ్రపతి వద్దకు చేరనుంది.
 

click me!