ఢిల్లీలో ఓ తండ్రి దారుణానికి పాల్పడ్డాడు. ఇద్దరు కుమారుల గొంతు కోసి అనంతరం ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటనలో చిన్న కుమారుడు మరణించాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఓ తండ్రి తన కన్న కుమారుల పట్ల కర్కశానికి ఒడిగట్టాడు. రెండు, ఐదేళ్ల వయస్సున్న ఇద్దరు పిల్లల గొంతు కోశాడు. అనంతరం అతడూ ఆత్మహత్యకు ఒడిగట్టాడు. ఈ ఘటన ఢిల్లీలోని దేశ రాజధాని ఢిల్లీలో కలకలం రేకెత్తించింది. ప్రస్తుతం నిందితుడు, పెద్ద కుమారుడు హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి విషమంగా ఉంది.
వివరాలు ఇలా ఉన్నాయి. వాయువ్య ఢిల్లీలోని భరత్ నగర్ సమీపంలోని వజీర్ పూర్ జె.జె.కాలనీలో 35 ఏళ్ల ఇన్వర్టర్ మెకానిక్ తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి జీవిస్తున్నారు. ఇటీవల ఆ కుటుంబం కలహాలు ఎక్కువవయ్యాయి. దీంతో అతడు తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. దీంతో ఆగ్రహంతో అతడు తన పిల్లలను హతమార్చి ఆత్మహత్యకు పాల్పడాలని భావించాడు. సోమవారం సాయంత్రం అతడి భార్య గ్రౌండ్ ఫ్లోర్ లో ఉండే అత్త దగ్గరకు వెళ్లింది.
vote from home : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు.. మొదలైన ఓట్ ఫ్రం హోం..
ఇదే సరైన సమయమని భావించిన అతడు ఓ పదునైన ఆయుధంతో కుమారుల గొంతు కోశాడు. అనంతరం అదే ఆయుధంతో ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటనలో చిన్న కుమారుడు మరణించాడు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడిచి చేరుకున్నారు. ముగ్గురినీ హాస్పిటల్ లో చేర్పించారు. అయితే ఇందులో నిందితుడు, పెద్ద కుమారుడి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.