
సాధారణంగా అందరూ తాము నిత్య జీవితంలో చేసే చిన్న చిన్న పనుల్లో నిర్లక్ష్యం వహిస్తుంటారు. కానీ అవి సమాజంపై చాలా ప్రభావం చూపిస్తాయి. చెత్తను ఎక్కడ పడితే అక్కడ పడేయడం, అవసరం తీరిపోయాక లైట్లు, ఫ్యాన్ల స్విచ్ లు ఆపకపోవడం, నీళ్లు తాగిన తరువాత ట్యాప్ లను బంద్ చేయకపోవడం వంటివి చేస్తుంటారు. అవి చూడటానికి చాలా చిన్న విషయాలుగానే కనిపిస్తాయి. కానీ ఆ అలవాట్లు క్రమశిక్షణా రాహిత్యం కిందకు వస్తాయి.
దోమ కాటుతో ట్రైనీ పైలెట్ మృతి.. దర్యాప్తులో షాకింగ్ విషయాలు వెల్లడి..
అయితే మనుషులే ఇంత నిర్లక్ష్యంగా ఉంటున్న ఈ సమయంలో కొన్ని జంతువులు మాత్రం క్రమశిక్షణగా మెదులుతున్న వీడియోలు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా అలాంటి వీడియోనే ఒకటి ఇప్పుడు ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తోంది. ఇది మనుషులకు ఓ గొప్ప సందేశాన్ని ఇస్తోంది.
Indian Railway: 10 నెలల చిన్నారికి ఉద్యోగమిచ్చిన రైల్వే శాఖ.. కారణం తెలిస్తే కన్నీరు ఆగదు..
ఐపీఎస్ అధికారి దీపాంషు కబ్రా ట్విట్టర్‌లో షేర్ చేసిన ఈ వీడియోలో ఓ కుక్క నీరు తాగేందుకు ప్రయత్నించింది. దీని కోసం తన నోటితో ట్యాప్ ను తిప్పి వాటర్ వచ్చిన తరువాత దానిని తాగింది. తరువాత ఆఫ్ చేసింది. ఇది నెటిజిన్లను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. “ప్రతీ చుక్క విలువైనది. ఈ విషయం కుక్కకి కూడా అర్థమైంది, మనం మనుషులు ఎప్పుడు అర్థం చేసుకుంటారు ’’ అని ఆ అధికారి క్యాప్షన్ పెట్టారు.
ఈ వీడియోకు 34వేలకు పైగా వ్యూవ్స్ వచ్చాయి. బాధ్యతాయుతమైన డాగ్ ఇంటర్నెట్ యూజర్లను ఆకట్టుకుంటోంది. ప్రతీ ఒక్కరూ ఈ తెలివైన కుక్క నుంచి నీటిని ఎలా సంరక్షించుకోవాలో తెలుసుకోవాలని కామెంట్స్ పెట్టారు. ఆ కుక్క చేసిన పనికి హ్యాట్సాప్ చెబుతున్నారు.