కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కుల గణనపైనే మొదటి సంతకం ఉంటుందని ఆ పార్టీ నాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. దేశంలో దళితులు, గిరిజనలు, ఓబీసీలు తమ వాస్తవ జనాభా అంటే ఏంటో తెలుసుకున్న రోజే దేశం శాశ్వతంగా మారుతుందని చెప్పారు.
దళితులు, గిరిజనలు, ఓబీసీలు తమ వాస్తవ జనాభా అంటే ఏంటో తెలుసుకున్న రోజే దేశం శాశ్వతంగా మారుతుందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. ఛత్తీస్ గఢ్ లోని బెమెతారా జిల్లాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో బుధవారం ఆయన పాల్గొని మాట్లాడారు. ‘‘రూ.12,000 కోట్ల విలువైన విమానంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రయాణిస్తూ.. ప్రతీ రోజూ కొత్త బట్టలు ధరిస్తారు. ఓబీసీ అనే పదాన్ని ఉపయోగించి ఆయన ఎన్నికయ్యారు. అయితే ఓబీసీలకు హక్కులు ఇచ్చే సమయం వచ్చినప్పుడు, భారతదేశంలో ఓబీసీ లేదని, పేదలు మాత్రమే కులమని చెప్పారు’’ అని అన్నారు.
Doda bus falls into gorge : దోడాలో లోయలో పడిన బస్సు.. 36 మంది మృతి.. ప్రధాని మోడీ సంతాపం..
undefined
‘‘ఓబీసీలు ఎంతమంది ఉన్నారో తెలుసుకుంటాం. నరేంద్ర మోడీ కుల గణన చేపట్టినా, చేపట్టకపోయినా ఛత్తీస్ గఢ్ లో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వచ్చిన రోజే ఇక్కడ కుల సర్వే మొదలవుతుంది. కేంద్రంలో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మరుసటి రోజే కుల గణన కోసమే తొలి ఉత్తర్వులు జారీ చేస్తాం’’ అని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. ఇది చారిత్రాత్మక నిర్ణయమని అన్నారు. స్వాతంత్య్రానంతరం ఇదే అతిపెద్ద విప్లవాత్మక నిర్ణయమన్నాని చెప్పారు.
jagityal car accident : జగిత్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం.. చెట్టును ఢీకొట్టిన కారు, ఇద్దరు యువకులు మృతి
కాంగ్రెస్ ప్రభుత్వాలు రైతుల రుణాలను మాఫీ చేశాయని రాహుల్ గాంధీ గుర్తు చేశారు. కానీ ప్రస్తుత బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అదానీ వంటి బడా పారిశ్రామికవేత్తల రుణాలను మాఫీ చేసిందని ఆరోపించారు. ‘‘ బిలియనీర్లు, బడా కాంట్రాక్టర్లకు బీజేపీ ఇచ్చే డబ్బును కాంగ్రెస్ పార్టీ.. రైతులు, కూలీలు, తల్లులు, సోదరీమణుల బ్యాంకు ఖాతాల్లో వేస్తుందని కర్ణాటక, ఛత్తీస్ గఢ్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలోని మా ముఖ్యమంత్రులందరికీ చెప్పాను’’ అని అన్నారు.
tunnel collapse : కుప్పకూలిన సొరంగం.. సహాయక చర్యల్లో ఆటంకాలు.. ఆగ్రహంతో ఆందోళన చేపట్టిన కార్మికులు
ఆర్థిక వ్యవస్థను రైతులు, కూలీలు, చిరు వ్యాపారులు, యువత నడుపుతున్నారని రాహుల్ గాంధీ అన్నారు. అయితే అదానీ జేబులోకి డబ్బు వెళ్తే ఆయన అమెరికాలో ఖర్చు చేస్తారని ఆరోపించారు. కానీ అదే డబ్బు రైతుకు అందితే గ్రామంలోనే ఖర్చు అవుతుందని, తద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుందని చెపపారు. ఇదిలా ఉండగా.. ఛత్తీస్ గఢ్ లోని 70 అసెంబ్లీ స్థానాలకు జరుగుతున్న రెండో దశ ఎన్నికల ప్రచారానికి బుధవారమే చివరి రోజు. నవంబర్ 7న తొలి విడతలో 20 స్థానాలకు పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే.