
బీజేపీ న్యాయవ్యవస్థపై పట్టు సాధించిన రోజు.. భారత్ లో ప్రజాస్వామ్యానికి అదే చివరి రోజు అవుతుందని మహారాష్ట్ర మాజీ సీఎం, శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. శంభాజీ నగర్ (ఔరంగాబాద్) లో సోమవారం నిర్వహించిన మహా వికాస్ అఘాడీ మెగా ర్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడారు. బీజేపీ దాని మంత్రులు న్యాయవ్యవస్థపై దాడిని కొనసాగిస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రస్తుత స్వతంత్ర కొలీజియం వ్యవస్థను రద్దు చేసి, దానిని తమ నియంత్రణలోకి తీసుకురావాలని ఆ పార్టీ ఆలోచిస్తోందని తెలిపారు.
అధికారం కోసం ప్రజాస్వామ్యంలోని ప్రధాన స్తంభాలను బీజేపీ నాశనం చేస్తోందన్నారు. ‘‘చివరి ఆశాకిరణం న్యాయవ్యవస్థ. ఈ చివరి స్తంభం కూడా పోతే, ఆ రోజు భారతదేశంలో ప్రజాస్వామ్యానికి చివరి రోజు అవుతుంది. ఇజ్రాయెల్ లో స్వతంత్ర న్యాయవ్యవస్థను కాపాడేందుకు ప్రజలు వీధుల్లోకి వచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీకి ఇజ్రాయెల్ ప్రధాని మిత్రుడు. ఆయన కూడా భారత ప్రధాని మాదిరిగా ప్రతిదీ తన నియంత్రణలో ఉండాలని కోరుకుంటున్నారు. కానీ ప్రజలు దానిని తీవ్రంగా వ్యతిరేకించారు. వారు విజయం సాధించారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలంటే, రాజ్యాంగాన్ని కాపాడాలంటే ఇలాంటి పోరాటమే చేయాలి’’ అని తెలిపారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం: మనీష్ సిసోడియాకు ఈ నెల 17 వరకు జ్యుడిషీయల్ కస్టడీ పొడిగింపు
ప్రధాని నరేంద్ర మోడీ తన ఇమేజ్ గురించి ఆందోళన చెందుతున్నారని, ప్రతిపక్షాలు ప్రతిష్టను దెబ్బతీస్తున్నారని ఉద్దవ్ ఠాక్రే ఆరోపించారు. మొదట ప్రతిపక్ష నేతలపై అవినీతి ఆరోపణలు చేయడం, వారిని ఇబ్బంది పెట్టడం, వేధించడం, జైల్లో పెడతామని బెదిరించడం బీజేపీ పద్దతి అని ఆయన అన్నారు. ‘‘ఆ తర్వాత ఆ నేతలనే బీజేపీలో చేర్చుకున్నారు. అలాంటి అవినీతిపరులతో ఇప్పుడు బీజేపీ నిండిపోయింది. అటల్ బిహారీ వాజ్ పేయి, ఎల్ కే అద్వానీ, బాలాసాహెబ్ ఠాక్రే వంటి పాత, బంగారు నాయకుల రోజులు పోయాయి. కాబట్టి బీజేపీ ఇప్పుడు తన పేరు భారతీయ జనతా పార్టీ కాకుండా అవినీతిపరుల పార్టీ అని మార్చుకోవాలి. వారి పార్టీ ముందు భారతీయ పదాన్ని ఉపయోగించే నైతిక అధికారం వారికి లేదు’’ అని ఠాక్రే విమర్శించారు.
అంబానీ పార్టీలో ఫుడ్‌తో టిష్యూకు బదులు కరెన్సీ నోట్లు? ఆ వైరల్ ట్వీట్ ఏం చెబుతున్నదంటే?
చట్టవిరుద్ధమైన మార్గాల ద్వారా తన ప్రభుత్వాన్ని పడగొట్టి, బీజేపీ తన అధికారాన్ని లాక్కుందని ఉద్దవ్ ఠాక్రే ఆరోపించారు. ఆపై తన తండ్రి స్థాపించిన పార్టీని, దాని చిహ్నాన్ని కూడా దోచుకుందని ఆయన అన్నారు. ‘‘మా నాన్న వారసత్వాన్ని దోచుకోవాలని చూస్తున్నారు. బీజేపీకి దమ్ముంటే తన మిత్రపక్షమైన షిండే నేతృత్వంలోని శివసేనతో కలిసి ఎన్నికల సమయంలో ప్రజల్లోకి వెళ్లి బాలాసాహెబ్ ఠాక్రే పేరు మీద కాకుండా మోడీ పేరు మీద ఓట్లు అడగాలి. ’’ అని అన్నారు. తాను హిందుత్వాన్ని వీడలేదని, ఎప్పటికీ అలా చేయబోనని ఉద్ధవ్ ఠాక్రే స్పష్టం చేశారు. అధికారం కోసం జమ్మూకాశ్మీర్ లో మెహబూబా ముఫ్తీ నేతృత్వంలోని ఉగ్రవాద అనుబంధ పార్టీతో బీజేపీ చేతులు కలిపిందని, ఆ సమయంలో బీజేపీ హిందుత్వను విడిచిపెట్టిందని ఆయన అన్నారు.