
సూరత్: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి ఈ నెల 13వ తేదీ వరకు సూరత్ కోర్టు బెయిల్ ను పొడిగించింది. 2019 ఎన్నికల సమయంలో కర్ణాటకలో జరిగిన ఓ సభలో రాహుల్ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దొగలందరి ఇంటి పేరు మోడీ ఎలా ఉంటుందని ఆయన ప్రశ్నించారు. ఈ విషయమై గుజరాత్ మాజీ మంత్రి , బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేష్ మోడీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.ఈ ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఈ నెల 23న రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. అయితే ఈ కేసులో రాహుల్ గాంధీ కోర్టును బెయిల్ కోరారు . ఈ తీర్పు ఇచ్చిన వెంటనే రాహుల్ గాంధీకి కోర్టు బెయిల్ కూడా ఇచ్చింది. రాహుల్ గాంధీకి బెయిల్ ను సూరత్ కోర్టు ఇవాళ పొడిగించింది. ఈ నెల 14వ తేదీ వరకు బెయిల్ ను పొడిగిస్తున్నట్టు సూరత్ కోర్టు సోమవారంనాడు ఆదేశాలు జారీ చేసింది.
పరువు నష్టం కేసులో తీర్పుపై స్టే కోరుతూ రాహుల్ పిటిషన్
పరువు నష్టం కేసులో సూరత్ కోర్టు తీర్పుపై స్టే కోరుతూ రాహుల్ గాంధీ సోమవారంనాడు సెషన్స్ కోర్టులో అప్పీల్ చేశారు. ఈ పిటిషన్ పై విచారణను కోర్టు ఈ నెల 13వ తేదీకి వాయిదా వేసింది.ఈ పిటిషన్వి పై చారణ కోసం రాహుల్ గాంధీ ఇవాళ సూరత్ కు వచ్చారు. రాహుల్ గాంధీతో పాటు ఆయన సోదరి ప్రియాంక గాంధీ కూడా ఉన్నారు.
పరువు నష్టం కేసులో సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించడంతో రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడింది. ఈ నెల 24న రాహుల్ గాంధీ ఎంపీ పదవికి అనర్హత పొందారని లోక్ సభ సెక్రటేరియట్ నోటిఫికేషన్ జారీ చేసింది. రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడంపై కాంగ్రెస్ సహా విపక్షాలు తప్పుబడుతున్నాయి.