ఫోన్ మాట్లాడొద్ద‌ని చెప్పినందుకు అత్త‌ను చంపిన కోడలు.. ఎక్క‌డంటే ?

By team teluguFirst Published Jun 11, 2022, 1:10 AM IST
Highlights

అతిగా ఫోన్ లో మాట్లాడవద్దని సూచించడమే ఆ అత్త పాలిట యమపాశం అయ్యింది. ఈ సూచన వల్ల అత్తా కోడళ్ల మధ్య గొడవ జరిగింది. దీంతో కోపం తెచ్చుకున్న కోడలు అత్తను కర్రలతో కొట్టి చంపేసింది. 

అతిగా ఫోన్ మాట్లాడొద్ద‌ని ఆ అత్త కోడ‌లుకు సూచించింది. దీంతో కోపం తెచ్చుకున్న కోడ‌లు ఆవేశంతో అత్త‌ను దారుణంగా హ‌త్య చేసింది. పైగా ఏమీ తెలియ‌న‌ట్టు న‌టించింది. కానీ పోలీసులు రంగ ప్ర‌వేశం చేయ‌డంతో ఆమె చేసిన నేరాన్ని ఒప్ప‌కుంది. ఈ ఘ‌ట‌న మ‌ధ్ర‌ప్ర‌దేశ్ లో చోటు చేసుకుంది. దామోహ్ జిల్లాలోని హట్టాలో ఓ కోడలు తన అత్తను కొట్టి చంపిన ఘ‌ట‌న సంచ‌ల‌నం సృష్టించింది. 

gang rape : దారుణం.. 12 ఏళ్ల బాలిక‌ను తుపాకీతో బెదిరించి గ్యాంగ్ రేప్.. చ‌ర్య‌లు తీసుకోని పోలీసులు

వివ‌రాలు ఇలా ఉన్నాయి. దామోహ్ జిల్లాలోని హటా పోలీస్ స్టేషన్‌లోని కొడియా గ్రామంలో నివసిస్తున్న అజయ్ బర్మన్ అనే యువకుడు తన తల్లి నన్నీబాయి అనుమానాస్పద మృతిపై పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతురాలి శరీరంపై గాయాల ఆనవాళ్లు ఉన్నట్లు గుర్తించారు. అయితే త‌న త‌ల్లి ప‌నికి వెళ్లినట్లు మృతుని కుమారుడు పోలీసులకు తెలిపాడు. ఆ స‌మ‌యంలో త‌న భార్య నుంచి ఫోన్ వ‌చ్చింద‌ని, అత్త గాయాల‌తో ఇంటికి వ‌చ్చింద‌ని, త‌రువాత చ‌నిపోయింద‌ని తెలిపారు. 

Aryan Khan : నా ద‌గ్గ‌ర డ్ర‌గ్స్ దొర‌క్క‌పోయినా న‌న్ను జైళ్లో ఉంచారు - ఆర్య‌న్ ఖాన్

మొత్తం సమాచారం తీసుకున్న పోలీసులు 24 గంటల్లో ఈ హత్య కేసును ఛేదించారు. వృద్ధురాలు మృతి కేసులో పోలీసులకు అనుమానం రావడంతో కోడలును అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో తానే ఈ హ‌త్య చేసిన‌ట్టు ఆమె ఒప్పుకున్నారు. అనంత‌రం నిందితురాలిని పోలీసులు అరెస్టు చేశారు. చిన్న చిన్న విషయాలకే తన అత్తగారు త‌న‌తో గొడవపడేవారని మృతురాలి కోడ‌లు చైనా బర్మన్ పోలీసులకు తెలిపారు. గ‌త కొంత కాలంగా వారిద్ద‌రి మ‌ధ్య వివాదం న‌డుస్తోంది. చిన్న చిన్న విష‌యాల‌కే వీర‌ద్ద‌రి మ‌ధ్య గొడ‌వ‌లు జ‌రిగేవి. అంత‌కు ముందు రోజు రాత్రి మొబైల్‌లో తాను మొబైల్ లో మాట్లాడుతుండ‌గా..అత్త వ‌చ్చి గొడ‌వ చేసింది. ఉదయం మళ్లీ గొడవ జరగడంతో నిందితురాలు కోడలు లాండ్రీ మొగ్రితో అత్త‌ తల, నోటిపై దాడి చేయడంతో వృద్దురాలు చ‌నిపోయింది. 

తల్లిని షూట్ చేసి చచ్చే వరకు ఎదురుచూసిన కొడుకు.. నొప్పితో గంటలపాటు తల్లడిల్లినా పట్టించుకోలేదు

అయితే ఈ హ‌త్య‌కు సంబంధించి కోడ‌లు అంత‌కు ముందు వేరే క‌థ చెప్పింది. త‌న అత్త మేకను  మేపడానికి వెళ్లారని, అక్కడే ఆమెకు గాయాలు అయ్యాయని కోడ‌లు తెలిపారు. ఆ గాయాలతోనే నన్నీబాయి ఇంటికి తిరిగి వ‌చ్చార‌ని, కొంత స‌మ‌యం త‌రువాత చ‌నిపోయార‌ని పేర్కొంది. కానీ పోలీసులు ఈ కేసులో చురుకుగా వ్యవహరించడంతో ఈ విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి. నిందితురాలిని అదుపులోకి తీసుకుని తదుపరి విచారణ ప్రారంభించారు.
 

click me!