రాష్ట్రాల అభివృద్ధి లేకుండా దేశం ఎప్పటికీ పురోగమించదు - ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు

By team teluguFirst Published May 28, 2022, 10:57 PM IST
Highlights

అన్ని రాష్ట్రాలు, కేంద్రం కలిసికట్టుగా పని చేయాలని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. రాష్ట్రాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. శనివారం ఆయన తమిళనాడులో కరుణానిధి విగ్రహాన్ని ఆవిష్కరించిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. 

రాష్ట్రాల అభివృద్ధి జ‌ర‌గ‌కుండా దేశం ఎన్న‌టికీ పురోగ‌మించ‌ద‌ని ఉప రాష్ట్రప‌తి వెంక‌య్య నాయుడు అన్నారు. శ‌నివారం చెన్నైలోని ట్రిప్లికేన్‌లోని ఓమండురార్ ప్రభుత్వ ఎస్టేట్‌లో దివంగ‌త నేత, తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి 16 అడుగుల ఎత్తైన కాంస్య విగ్రహాన్ని ఆయ‌న ఆవిష్క‌రించి నివాళి అర్పించారు. ఆయ‌న వెంట తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఉన్నారు. ఈ కార్య‌క్ర‌మం సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన స‌భ‌లో ఉప రాష్ట్రప‌తి మాట్లాడారు. 

‘‘ వివిధ రాష్ట్రాల్లో వివిధ రాజకీయ పార్టీలు పాలిస్తున్నాయి. ప్రజల ప్రయోజనాల కోసం మనం అందరం కలిసి పని చేయాలి. రాష్ట్రం అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందుతుంది. రాష్ట్రాలు అభివృద్ధి చెందకుండా దేశం ఎప్పటికీ అభివృద్ధి చెందదు ’’ అని ఉప రాష్ట్రప‌తి వెంక‌య్య‌నాయుడు అన్నారు. 

తమిళనాడులో ద్రవిడియన్ మోడల్ ట్రైనింగ్ క్యాంపులు.. జాతి వ్యతిరేక శక్తులను ఎదుర్కోవడానికి..!

అందరూ ఒకే దేశానికి చెందినవారు కాబట్టి పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులు ఒకరినొకరు గౌరవించుకోవాలని ఉపరాష్ట్రపతి ఉద్ఘాటించారు. ‘‘ ప్రజా జీవితంలో రాజకీయ నాయకులు ఒకరినొకరు గౌరవించుకోవాలి. మనం శత్రువులం కాదు కానీ రాజకీయ ప్రత్యర్థులం మాత్రమే. ఆధునిక రాజకీయ నాయకులకు ఇది నా సలహా. మీరు ఈ భాగానికి లేదా ఆ పార్టీకి చెందినవారై ఉండవచ్చు, కానీ మనమందరం ఈ గొప్ప దేశానికి చెందినవాళ్లం ’’ అని ఆయన చెప్పారు. 

భాషా వివాదాల కొనసాగుతున్న నేపథ్యంలో దీనిని ఆయన ప్రస్తావించారు. ప్రతీ భారతీయ భాష చాలా గొప్పదని ఉపరాష్ట్రపతి నొక్కి చెప్పారు. ‘‘ మన మాతృభాషను, మాతృభూమిని మనం ప్రోత్సహించాలి. మనం ఏ భాషను వ్యతిరేకించకూడదు. కానీ మన భాషకు మద్దతు ఇవ్వాలి. ఏ భాషను రుద్దడం లేదని, అలాగని ఏ భాషపై వ్యతిరేకత లేదు ’’ అని ఆయన అన్నారు. 

సమర్థ నాయకత్వం ఉన్న బలమైన దేశం మనదని వెంకయ్య నాయుడు అన్నారు. అన్ని అణగారిన వర్గాలు, రాష్ట్రాలను జాగ్రత్తగా చూసుకుంటూ మన ప్రజల సంక్షేమం కోసం అందరం పాటు పడాలని ఆయన సూచించారు. కేంద్రం, రాష్ట్రాలు కలిసి టీమ్ ఇండియాగా పనిచేయాలని చెప్పారు  అనంతరం కరుణానిధి గురించి మాట్లాడుతూ.. భారతదేశం దిగ్గజ నాయకులలో కరుణానిధి ఒకరని కొనియాడారు. ప్రజలను కేంద్రంగా ఉంచిన గొప్ప వ్యక్తి అని అన్నారు. సుస్థిర ప్రభుత్వాన్ని అందించి అణగారిన వర్గాల సంక్షేమం కోసం, వివిధ వర్గాల సామాజిక న్యాయం కోసం కృషి చేసిన సమర్ధుడైన పరిపాలకుల్లో ఆయన ఒకరని చెప్పడానికి ఎలాంటి సందేహమూ లేదని చెప్పారు. 

11 రోజుల క్రితం అదృశ్యం... బావిలో శవమై తేలిన బాలిక.. కాళ్లు, చేతులు తాళ్లతో కట్టి

అనంతరం సీఎం కే.స్టాలిన్ మాట్లాడుతూ.. అన్నాసాలైపై అన్నా, పెరియార్‌ విగ్రహాల మధ్య కరుణానిధి విగ్రహం ఉండడం ఎంతో ప్రత్యేకతగా నిలిచిందని చెప్పారు.కరుణానిధి, వెంకయ్య నాయుడు మంచి మిత్రులని, వారి పాలకులను దూషించారని స్టాలిన్ గుర్త చేశారు. “ విగ్రహాన్ని ఆవిష్కరించగల వ్యక్తి ఎవరున్నారని ఆలోచించినప్పుడు వెంకయ్య నాయుడు మా దృష్టికి వచ్చారు. మేము ఆయనను ఆహ్వానిస్తే వెంటనే రావడానికి అంగీకరించారు” అని స్టాలిన్ అన్నారు.  ఆధునిక తమిళనాడును అభివృద్ధి చేయాలనే దృక్పథం ఉన్నందున కరుణానిధి సృష్టించారని ముఖ్యమంత్రి అన్నారు. “అందుకే మేము ఆయనను ఆధునిక తమిళనాడు పితామహుడిగా కీర్తిస్తాము. ఆయన అమలు చేసిన పథకాల వల్ల రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ లబ్ధి పొందుతారని అన్నారు.

ఈ సందర్భంగా కరుణానిధి సాధించిన విజయాలను తెలిపే డాక్యుమెంటరీని ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో నటుడు రజనీకాంత్‌తో పాటు కూటమి పార్టీల నేతలు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. జలవనరుల శాఖ మంత్రి దురైమురుగన్‌ స్వాగతం పలుకగా, ప్రధాన కార్యదర్శి వి.ఇరై అన్బు కృతజ్ఞతలు తెలిపారు.

click me!