తమిళనాడులో ద్రవిడియన్ మోడల్ ట్రైనింగ్ క్యాంపులు.. జాతి వ్యతిరేక శక్తులను ఎదుర్కోవడానికి..!

By Mahesh KFirst Published May 28, 2022, 8:04 PM IST
Highlights

తమిళనాడులో అధికార పార్టీ డీఎంకే కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో జాతి వ్యతిరేక, ప్రమాదకర శక్తులను ఎదుర్కోవడానికి డ్రవిడియన్ మోడల్ ట్రైనింగ్ క్యాంపులు నిర్వహించాలని తీర్మానించింది. జాతి వ్యతిరేక శక్తులు, వాటికి సహకరిస్తున్నవారిని గుర్తించి రాష్ట్రాన్ని కాపాడాలని నిర్ణయం తీసుకుంది. పార్టీ కార్యకర్తలు ముందంజలో ఉండి నడపాలని సూచించింది.

చెన్నై: తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జాతి వ్యతిరేక శక్తులను ఎదుర్కోవడానికి, అందుకు సహకరించిన వారిని ఎదుర్కోవడానికి ఎంకే స్టాలిన్ పార్టీ ద్రవిడియన్ మోడల్‌లో ట్రైనింగ్ క్యాంపులు నిర్వహించాలని నిర్ణయించింది. జాతి విద్రోహ, ప్రమాదకర శక్తులను గుర్తించి, మతపరమైన అసహనాన్ని రాష్ట్రంలో నాటకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడానికి ఈ నిర్ణయం అని తమిళనాడు అధికార పార్టీ ద్రవిడ మున్నేట్ర కజగం శనివారం ఓ సమావేశంలో వెల్లడించింది.

పార్టీ కార్యకర్తలు ఈ ట్రైనింగ్ క్యాంపులు నిర్వహించడానికి సైనికులుగా ముందుండి నడపాలని డీఎంకే తెలిపింది. రాష్ట్రంలో జాతి విద్రోహ శక్తులను అడ్డుకోవడానికి సన్నద్ధులు చేయాలని తెలిపింది. సీఎం తన ఆలోచనలను అమలు చేయడానికి పార్టీ కార్యకర్తలు అందరూ అండగా ఉండాలని వివరించింది.

తమిళనాడు రాష్ట్రంలో మత సామరస్యం, సామాజిక న్యాయం వర్ధిల్లడానికి పెరియార్, సీఎన్ అన్నాదురై, ఎం కరుణానిధిల శ్రమేనని డీఎంకే తన తీర్మానంలో పేర్కొంది. రాష్ట్రంలో జాతి వ్యతిరేక, ప్రమాదకర శక్తులను గుర్తించాలని, తద్వార రాష్ట్రాన్ని కాపాడాలని పార్టీ తీర్మానించింది. డీఎంకే నేత ఎం కరుణానిధి 99వ జయంతి సందర్భంగా పార్టీ నిర్వహించిన సమావేశంలో జిల్లా సెక్రటరీలు హాజరయ్యారు.

ప్రధాని నరేంద్ర మోడీ (narendra modi) ఎదుట తమిళనాడు సీఎం స్టాలిన్ (stalin) సంచలన వ్యాఖ్యలు చేశారు. ద్రవిడ పాలన మోడల్ దేశానికి చూపిస్తామని.. తమిళనాడులో (tamilnadu) తమిళమే మాట్లాడుతామని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రాలకు నిధులివ్వాల్సిన బాధ్యత కేంద్రానిదేనని స్టాలిన్ వ్యాఖ్యానించారు. రాష్ట్రాలతో కేంద్రం కలిసి పనిచేస్తేనే దేశాభివృద్ధి అని స్టాలిన్ వెల్లడించారు. 

మరోవైపు.. ప్రధాని మోదీ చెన్నై పర్యటనలో హైడ్రామా చోటు చేసుకుంది. మోదీ సభకు వేదికైన నెహ్రూ ఇండోర్‌ స్టేడియంలో అటు డీఎంకే మద్దతుదారులు , ఇటు బీజేపీ కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలు చేయడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రధాని మోదీ జిందాబాద్‌ అని బీజేపీ కార్యకర్తలు నినాదాలు చేయగా .. దళపతి జిందాబాద్‌ అంటూ డీఎంకే కార్యకర్తలు నినాదాలు చేశారు. 

click me!