అదానీ సమస్యతో దేశ ప్రతిష్ట ప్రమాదంలో పడింది - బీఎస్పీ అధినేత్రి మాయావతి

By Asianet NewsFirst Published Feb 5, 2023, 3:07 PM IST
Highlights

అదానీ వల్ల దేశ ప్రతిష్ట దిగజారిందని యూపీ మాజీ సీఎం, బీఎస్పీ చీఫ్ మాయావతి అన్నారు. కానీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దానిని లైట్ తీసుకుంటోందని ఆరోపించారు. 

గౌతమ్ అదానీ సమస్య కారణంగా భారతదేశ ప్రతిష్ట ప్రమాదంలో పడిందని, దాని గురించి అందరూ ఆందోళన చెందుతున్నారని బీఎస్పీ అధినేత్రి మాయావతి అన్నారు. అయితే బీజేపీ ప్రభుత్వం దానిని చాలా తేలికగా తీసుకుంటోందని ఆరోపించారు. గౌతమ్ అదానీ కేసు భారత ఆర్థిక వ్యవస్థపై దీర్ఘకాలిక ప్రభావం చూపుతుందని, ఈ దేశ ప్రజలను ప్రభుత్వం విశ్వాసంలోకి తీసుకోకపోవడం దురదృష్టకరమన్నారు.

పర్వేజ్ ముషారఫ్ మరణం: కార్గిల్ యుద్ధం మాస్టర్ మైండ్, కశ్మీర్ సమస్య పరిష్కారానికి ప్రయత్నం.. ఆసక్తికర వాస్తవాలు

‘‘రవిదాస్ జయంతి రోజున అదానీ ఎపిసోడ్‌ను ఎలా మరచిపోతారు. ఇది ఆందోళన కలిగించే కొత్త కారణం ? ఇలాంటి విషయాలకు పరిష్కారాలు కనుగొనే బదులు, ప్రజలను విస్మరిస్తూ ప్రభుత్వం కొత్త వాగ్దానాలు చేస్తోంది. అదానీ సమస్య కారణంగా భారతదేశం ప్రతిష్ట ప్రమాదంలో పడింది. ప్రతీ ఒక్కరూ ఆందోళన చెందుతున్నారు. కానీ ప్రభుత్వం ఈ సమస్యను చాలా తేలికగా తీసుకుంటోంది. ఇది ఆలోచించాల్సిన విషయం’’ అని మాయావతి తాజాగా విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. 

చైనాకు మ‌రోసారి షాకిచ్చిన భారత్‌.. 232 చైనా యాప్‌లపై నిషేధం

‘‘ఈ దేశానికి చెందిన ఒక వ్యాపారవేత్త ప్రపంచంలో తన ర్యాంక్‌ను నెలకొల్పడం వల్ల భారతదేశ ఆర్థిక ప్రపంచం నిరాశ నిస్పృహలో ఉంది. అదానీ విషయంలో ఇతర కేసుల మాదిరిగా, సభ ద్వారా ఈ దేశ ప్రజలను ప్రభుత్వం విశ్వాసంలోకి తీసుకోవడం లేదు. ప్రజల విశ్వాసంతో ప్రభుత్వం ఆడుకోకూడదు.’’ అని అన్నారు.

05-01-2023-BSP PRESSNOTE-SANTGURU RAVIDAS JAYANTI pic.twitter.com/aKXrly0Zyc

— Mayawati (@Mayawati)

10 రోజుల కిందట అమెరికాకు చెందిన ‘షార్ట్ సెల్లర్’, ఫైనాన్షియల్ రీసెర్చ్ కంపెనీ హిండెన్‌బర్గ్ కంపెనీ అదానీ గ్రూప్స్ పై పలు ఆరోపణలు చేశారు. ఆ తర్వాత అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు భారీగా పతనం కావడం గమనార్హం. అయితే అహ్మదాబాద్‌కు చెందిన అదానీ గ్రూప్ ఆరోపణలన్నింటినీ ఖండించింది. ఇది భారతదేశంపై ప్రణాళికాబద్ధమైన దాడిగా పేర్కొంది. అప్పటి నుంచి ప్రతిపక్షాలు బీజేపీని ప్రశ్నిస్తూనే ఉన్నాయి. 
 

click me!