అయ్యో.. దేశంలో అత్యంత వృద్ధ ఎలుగుబంటి ‘బబ్లూ’ మృతి.

By Sairam Indur  |  First Published Jan 5, 2024, 6:37 PM IST

India's oldest bear dead : మధ్యప్రదేశ్ (madhya pradesh) రాజధాని భోపాల్‌ (bhopal)లోని జూ-కమ్-యానిమల్ రెస్క్యూ సెంటర్‌ (zoo-cum-animal rescue centre)లో రక్షణ పొందుతున్న 36 ఏళ్ల మగ ఎలుగుబంటి మరణించింది. దానిని జూ అధికారులు బబ్లూ (Bablu) అని పిలిచేవారు. అయితే అవయవాలు విఫలం కావడంతో ఆ ఎలుగుబంటి శుక్రవారం మరణించింది.


దేశంలోనే అత్యంత వృద్ధ ఎలుగుబంటిగా రికార్డుల్లోకి ఎక్కిన ‘బబ్లూ’ మరణించింది. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లోని జూ కమ్ యానిమల్ రెస్క్యూ సెంటర్ లో ఆ మగ ఎలుగుబంటి చాలా కాలంగా అది జీవిస్తోంది. అయితే అది బహుళ అవయవ వైఫల్యంతో మృతి చెందింది. చనిపోయే నాటికి దానికి 36 ఏళ్ల వయస్స ఉంటుంది.

ఢిల్లీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ పదవికి స్వాతి మలివార్ రాజీనామా.. కారణం ఏంటో తెలుసా ?

Latest Videos

undefined

బబ్లూ అనే ఈ ఎలుగుబంటి ప్రస్తుతం దేశంలో చెరలో ఉన్న అత్యంత పురాతనమైన ఎలుగుబంటి అని ఆ జూ కమ్ రెస్క్యూ సెంటర్ ను నిర్వహిస్తున్న అధికారి ‘ది న్యూ  ఇండియన్ ఎక్స్ ప్రెస్’తో తెలిపారు. వాన్ విహార్ నేషనల్ పార్క్ కమ్ యానిమల్ రెస్క్యూ అండ్ రిహాబిలిటేషన్ సెంటర్లో గురువారం బబ్లూ మృతి చెందినట్లు వెటర్నరీ డాక్టర్ అతుల్ గుప్తా చెప్పారు.

ఆ ఎలుగుబంటి మూడు, నాలుగు రోజుల క్రితం తినడం మానేసిందని అధికారులు పేర్కొన్నారు. 2006 మే 6న 19 ఏళ్ల వయసులో బబ్లూను రాజస్థాన్ లోని 'మదారీ' (స్ట్రీట్ పెర్ఫార్మర్) నుంచి రక్షించారు. అనంతరం దానిని వాన్ విహార్కు తీసుకువచ్చినట్లు ఫెసిలిటీ అసిస్టెంట్ డైరెక్టర్ ఎస్ కే సిన్హా తెలిపారు. అయితే అడవిలో ఎలుగుబంటి సగటు ఆయుర్దాయం 25 నుంచి 30 ఏళ్ల వరకు ఉంటుందని తెలిపారు.

నేతను అరెస్టు చేసేందుకు వెళ్తే.. ఈడీ బృందంపైనే దాడి.. 200 మంది చుట్టుముట్టి.. సినిమా స్టైల్ లో ఫైట్..

బబ్లూ మరణంపై వైల్డ్ లైఫ్ ఎస్ఓఎస్ ప్రెస్ అండ్ కమ్యూనికేషన్ ఆఫీసర్ నీల్ బెనర్జీ మాట్లాడుతూ.. జనవరి 2022 లో వాన్ విహార్ నేషనల్ పార్క్ లో ఆడ ఎలుగుబంటి 40 సంవత్సరాల వయస్సు మరణించిందని తెలిపారు. దాని తరువాత బబ్లూనే దేశంలో (చెరలో ఉన్న) పురాతన ఎలుగుబంటి అని చెప్పారు. తమ స్వచ్ఛంద సంస్థ భారతదేశం అంతటా ఏనుగులు, ఎలుగుబంట్లు, చిరుతలను రక్షించడానికి పని చేస్తోందని తెలిపారు. 

యూపీఎస్సీ చైర్మన్ తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. టీఎస్‌పీఎస్సీ ప్రక్షాళనపై చర్చ

కాగా.. పోస్టుమార్టం అనంతరం బబ్లూ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. ఆ ఎలుగు బంటికి సంబంధించిన ముఖ్యమైన శరీర భాగాలను జబల్ పూర్ కు చెందిన వైల్డ్ లైవ్ ఫోరెన్సిక్ అండ్ హెల్త్ ఆర్గనైజేషన్ కు పంపించారు. 

click me!