బీజేపీ పాలనలో దేశం వేదనతో నిండిపోయింది.. ప్రతిపక్షాలు ఐక్యంగా ఉండాలి - ఎన్సీపీ

By team teluguFirst Published Sep 11, 2022, 10:41 AM IST
Highlights

కేంద్రంలోని బీజేపీ పాలన వల్ల దేశం వేదనలో ఉందని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అన్నారు. రైతుల, నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలం అయ్యిందని ఆరోపించారు. 

బీజేపీ పాలనలో దేశం వేదనతో నిండిపోయిందని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) ఆరోపించింది. ప్ర‌తిప‌క్ష పార్టీల‌న్నీ ఐక్యంగా ఉండాల్సిన అవ‌స‌రం ఉంద‌ని పేర్కొంది. శ‌నివారం సాయంత్రం ఆ పార్టీ కార్య‌వర్గ స‌మావేశం జ‌రిగింది. ఇందులో ఆ పార్టీ జాతీయ అధ్య‌క్షుడిగా శ‌రద్ ప‌వార్ ను తిరిగి ఎన్నుకుంది. వ‌ర్కింగ్ క‌మిటీ కాల ప‌రిమితిని పొడించారు. 

కృష్ణం రాజు ఆస్తుల వివరాలు.. మొగల్తూరులోనే అంత ఉందా, దిమ్మతిరిగిపోద్ది..

ఈ సంద‌ర్భంగా ఎన్సీపీ శ‌ర‌ద్ ప‌వార్ వ‌ర్కింగ్ క‌మిటీని ఉద్దేశించి మాట్లాడారు. కేంద్రంలోని మోడీ ప్ర‌భుత్వం రైతు వ్యతిరేక ప్ర‌భుత్వం అని అన్నారు. నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలో కేంద్రం విఫలమైందని ఆరోపించారు. వరి పంటకు మంచి ధర వస్తుందని రైతులు ఎదురు చూస్తున్నారని, అయితే ప్రభుత్వం వరిపై 20 శాతం ఎగుమతి సుంకం విధించిందని తెలిపారు. ఈ సంద‌ర్భంగా బిల్కిస్ బానో గ్యాంగ్‌రేప్ కేసులో ఖైదీల విడుదలపై కూడా ఆయన బీజేపీపై మండిపడ్డారు. 

‘‘ మహిళల గౌరవాన్ని నిలబెట్టేలా ప్రధాని మాట్లాడటం నాకు ఆశ్చర్యం కలిగించింది. రెండు రోజుల తర్వాత ప్రధాని సొంత రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం బిల్కిస్ బానో, ఆమె కుటుంబ సభ్యులపై అఘాయిత్యాలకు పాల్పడిన వారికి శిక్షను తగ్గించింది’’ అని పవార్ అన్నారు. దేశం తీవ్ర వేదనతో ఉంద‌ని, ప్రతి ఫోరమ్‌లో ఈ సమస్యలను తీవ్రంగా చ‌ర్చించాల‌ని చెప్పారు. 

కేంద్రాన్ని విమర్శించకుంటే.. నేనే ఉపరాష్ట్రపతిని అయ్యేవాడిని.. : మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్

కాగా.. ఈ కార్య‌వ‌ర్గ స‌మావేశంలో బీజేపీ దాని మిత్రపక్షాలకు వ్యతిరేకంగా పోరాడటానికి భావసారూప్యత గల పార్టీల ఐక్యత కోసం కృషి చేయాల‌ని రాజ‌కీయ తీర్మానం చేశారు.  ‘‘ ఈ పార్టీలను ఏకతాటిపైకి తీసుకురావడంలో, ఎన్‌డీఏను ఎదుర్కోవడానికి ఐక్య ఫ్రంట్‌ను ఏర్పాటు చేయడంలో శరద్ పవార్ ముఖ్యమైన పాత్ర పోషించారు. మనం ఈ సంకల్పాన్ని బలోపేతం చేయాలి. ప్రతిపక్ష ఐక్యత లక్ష్యంగా పని చేయాలి. దీనిని విజయవంతంగా సాధించేలా చూసుకోవాలి ’’ అని ఆ తీర్మానంలో పేర్కొన్నారు. 

రాజకీయ తీర్మానంపై అనంతరం ఎన్సీపీ సీనియర్ నాయకుడు పీసీ చాకో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాత మైండ్‌సెట్‌లో ఉండిపోయిందని, రాజకీయ దృశ్యాన్ని గుర్తించడంలో విఫలమైందని మండిపడ్డారు. ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ ఒక్క పంచాయతీ ఎన్నికల్లోనూ గెలవలేదని, ప్రతిపక్షాలన్నింటినీ ఏకతాటిపైకి తీసుకురావడం పవార్ తో మాత్రమే సాధ్యమని అన్నారు. 

ఛాతీపై తుపాకీ పెట్టి బెదిరించి అసహజ శృంగారం... ఎంపీలో దారుణం

కాగా.. డిసెంబర్‌లో బీజేపీ పాలిత గుజరాత్‌, హిమాచల్‌ప్రదేశ్‌లలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా, రాజస్థాన్, కర్ణాటకతో సహా మరో తొమ్మిది రాష్ట్రాల్లో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా పవార్‌తో చర్చలు జరిపారు. బీజేపీని ఎదుర్కోవటానికి ప్రతిపక్షాలను ఏకం చేసేందుకు ఆయ‌న ప్ర‌య‌త్నాలు సాగిస్తున్నారు. 

click me!