ఛాతీపై తుపాకీ పెట్టి బెదిరించి అసహజ శృంగారం... ఎంపీలో దారుణం

Published : Sep 11, 2022, 07:45 AM ISTUpdated : Sep 11, 2022, 07:49 AM IST
ఛాతీపై తుపాకీ పెట్టి బెదిరించి అసహజ శృంగారం... ఎంపీలో దారుణం

సారాంశం

కట్టుకున్న భర్తే తుపాకీతో బెదిరించి మరీ అసహజ శృంగారానికి పాల్పడుతున్నాడంటూ ఓ మహిళ పోలీసులను ఆశ్రయించిన ఘటన ఉత్తర ప్రదేశ్ లోని గ్వాలియర్ నగరంలో చోటుచేసుకుంది. 

గ్వాలియర్ : కట్టుకున్నవాడే ఆమెపాలిట కాలయముడయ్యాడు. ప్రేమగా దగ్గరకుతీయాల్సిన భర్తే కామంతో రగిలిపోతూ అత్యంత దారుణంగా వ్యవహరించడం ఆ ఇళ్ళాలు తట్టుకోలేకపోయింది. ఆమె ఇష్టాయిష్టాలతో పని లేకుండా తుపాకీతో బెదిరించి మరీ అసహజ శృంగారం చేస్తూ నిత్యం నరకం చూపించేవాడట. ఇలా భర్త చేష్టలతో విసిగిపోయిన మహిళ పోలీసులను ఆశ్రయించిన ఘటన మధ్యప్రదేశ్ లో వెలుగుచూసింది. 

మధ్య ప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్ కు చెందిన మహిళకు రెండేళ్ళక్రితం వివాహమయ్యింది. కొంతకాలం వీరి సంసారం సాఫీగా సాగింది. అయితే కొంతకాలం తర్వాత భర్త ప్రవర్తన పూర్తిగా మారిపోయి అతడిలోని  సైకో బయటకువచ్చాడు. కామంతో కళ్లుమూసుకుపోయిన అతడు భార్యను బజారుమనిషిలా చూడటం ప్రారంభించాడు. ఆమెకు ఇష్టం లేకున్నా అసహజంగా శృంగారం చేసేవాడు. ఇందుకు ఆమె నిరాకరించిన ప్రతిసారి తుపాకీతో బెదిరించేవాడు. 

read more  వివాహేతర సంబంధం : ప్రియురాలి కుమార్తెపై కన్నేసిన ఎస్సై.. ఏడేళ్లుగా లైంగిక వేధింపులు.. పెళ్లైనా వదలకపోవడంతో...

ఇలా భర్త అతిచేష్టలతో విసిగిపోయిన మహిళ పోలీసులను ఆశ్రయించింది. తనను భర్త నిత్యం శారీరకంగానే కాదు మానసికంగా హింసిస్తున్నాడంటూ ఫిర్యాదు చేసింది. అదనపు కట్నం కోసం వేధించడమే కాదు తుపాకీ చాతీపై పెట్టి కాలుస్తానని బెదిరించి అసహజ శృంగారానికి పాల్పడేవాడని తెలిపింది. దీంతో పోలీసులు ఆమె ఫిర్యాదును స్వీకరించి ఆ కసాయి భర్తపై వర్నకట్న వేధింపులతో పాటు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసారు. 

PREV
click me!

Recommended Stories

Viral News: ఈ గ్రామంలో మ‌హిళ‌లు 5 రోజులు న‌గ్నంగా ఉంటారు.. వింత ఆచారం ఎక్క‌డంటే
Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌