
15-18 ఏళ్ల మధ్య వయసున్న పిల్లలకు వ్యాక్సిన్ అందిచే విషయంలో కేంద్ర ప్రభుత్వం సోమవారం మార్గదర్శకాలు జారీ చేసింది. 15-18 ఏళ్ల మధ్య వయసున్న పిల్లలకు కరోనా వ్యాక్సిన్, 60 ఏళ్లు పైబడిన వృద్ధులకు, కరోనా ఫ్రంట్ లైన్ వర్కర్స్ కు మరో అదనపు డోసు ఇస్తామని ఇటీవలే ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఈరోజు అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. పిల్లలకు వచ్చే ఏడాది జనవరి 3వ తేదీ నుంచి, వృద్ధులకు, ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు జనవరి 10వ తేదీ నుంచి వ్యాక్సిన్ వేయనున్నారు. అయితే ఈరోజు విడుదలైన మార్గదర్శకాల ప్రకారం.. ఫ్రంట్ లైన్ వారియర్స్‌లకు, వృద్ధులకు వారి రెండో డోసు పూర్తయిన 90 రోజుల తరువాత ఈ అదనపు డోసు ఇవ్వాలని ప్రభుత్వం పేర్కొంది.
ఆ రంగంలో.. తెలంగాణ 3వ స్థానం.. ఏపీ 4వ స్థానం
ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే..?
కరోనా కేసులు పెరుగుతుండంతో కేంద్ర ప్రభుత్వం అలెర్ట్ అయ్యింది. ఇప్పటి వరకు వ్యాక్సిన్ అర్హత లేని పిల్లలకు కూడా వ్యాక్సిన్ వేయాలని నిర్ణయించింది. కాలేజీలకు, స్కూళ్లకు వెళ్లే పిల్లలకు వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల వారు కరోనా నుంచి, అలాగే కొత్త వేరియంట్ నుంచి రక్షణ పొందవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం మార్గదర్శకాలు విడుదల చేసింది. అయితే దీనిని ఎలా పొందాలనే విషయంలో సోమవారం ఉదయమే ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. టీకాలు వేయించుకోవడానికి 15 నుంచి 18 ఏళ్ల వయసు పిల్లలు జనవరి 1 నుంచి CoWIN యాప్‌లో రిజిస్టర్ చేసుకోవచ్చని సూచించింది. దీని కోసం పిల్లలు విద్యాసంస్థల ఐడీ కార్డులను కూడా రిజిస్ట్రేషన్ కోసం ఉపయోగించవచ్చని తెలిపింది.
ఈ విషయంలో CoWIN చీఫ్ డాక్టర్ ఆర్ఎస్ శర్మ మీడియాతో మాట్లాడారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో గుర్తింపు కార్డులకు సంబంధించి అదనపు కార్డును జోడించామని తెలిపారు. వ్యాక్సిన్ వేయించుకునే స్డూడెంట్లు వారి స్కూల్ లేదా కాలేజీ ఇచ్చిన ఐడీ కార్డులను ఉపయోగించి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని అన్నారు. కొందరు పిల్లలకు ఆధార్, ఇతర అవసరమైన ఐడీ కార్డులు ఉండకపోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే ఆధార్ కార్డు, ఎలాంటి ఐడీ కార్డులు లేని బడి బయటి పిల్లలకు మాత్రం ఈ నిర్ణయం కొంత ఇబ్బంది కలిగించేదే. అయితే వారి విషయంలో కూడా ప్రభుత్వం ఏదో ఒక ప్రత్యామ్నాయం ఆలోచిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
ఒమిక్రాన్ ఎఫెక్ట్.. ఐదు రాష్ట్రాల ఎన్నికలు వాయిదా? ఈసీ నిర్ణయంపై ఉత్కంఠ
దేశంలో 578కి చేరిన ఒమిక్రాన్ కేసుల సంఖ్య..
భారతదేశంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. సోమవారం సాయంత్రం నాటికి భారత్‌లో కొత్త వేరియంట్ కేసుల సంఖ్య 578కి చేరింది. అయితే ఇందులో 151 మంది కోలుకున్నారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. గడిచిన 24 గంటల్లో ఢిల్లో కోవిడ్ -19 కేసుల సంఖ్య 331 కేసులు నమోదయ్యాయి. ఇందులో 144 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఒకరు మృతి చెందారు. దీంతో ఢిల్లీలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,289కు చేరుకున్నాయి. మొత్తం పాజిటివ్ కేసులు 14,43,683గా నమోదయ్యాయి. అయితే ఒమిక్రాన్ కేసులు ఢిల్లీ లో 142, మహారాష్ట్రలో 141, కేరళ లో 57, గుజరాత్ లో 49, రాజస్థాన్ లో 43 కేసులు నమోదయ్యాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.