మేం బయట చేయాల్సిన పనులున్నాయ్.. కాస్త సమయం ఇవ్వండి.. - సుప్రీంకోర్టును కోరిన బిల్కిస్ బానో కేసు దోషులు

By Sairam Indur  |  First Published Jan 18, 2024, 1:12 PM IST

బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారం (Bilkis Bano case), ఏడుగురి హత్య కేసులో ముగ్గురు దోషులు (Bilkis Bano case 3 convicts) లొంగిపోవడానికి (surrender) గడువును కోరుతూ గురువారం సుప్రీంకోర్టు (Supreme Court)ను ఆశ్రయించారు. తమకు కొన్ని బాధ్యతలు ఉన్నాయని, వాటిని పూర్తి చేసుకొని లొంగిపోతామని పేర్కొంటూ పిటిషన్ దాఖలు చేశారు.


బిల్కిస్ బానో కేసులో ముగ్గురు దోషులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తమకు బయట కొన్ని పనులు, బాధ్యతలు ఉన్నాయని, వాటిని పూర్తి చేయాల్సి ఉందని, కాబట్టి లొంగిపోయేందుకు కొంత సమయం ఇవ్వాలని వారు కోర్టును కోరారు. తమ లొంగుబాటు గడువును ఆరు నుంచి నాలుగు వారాల పాటు పొడిగించాలని కోరుతూ సుప్రీంకోర్టుకు దరఖాస్తు చేసుకున్నారని ‘ఇండియా టుడే’ పేర్కొంది.

అయోధ్య ఆలయ ప్రారంభోత్సవం రోజు విద్యాసంస్థలకు సెలవులు

Latest Videos

undefined

ఆదివారంతో ఈ లొంగుబాటు సమయం ముగుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ కేసును అత్యవసరంగా చేపట్టాలని జస్టిస్ బీవీ నాగరత్న నేతృత్వంలోని ధర్మాసనం ముందు పిటిషనర్ తరఫు న్యాయవాదులు కోరారు. అత్యవసర విచారణ కోసం ఈ కేసును సీజేఐ ముందు ఉంచాలని ధర్మాసనం రిజిస్ట్రీని ఆదేశించింది. దీంతో ఈ కేసు శుక్రవారం విచారణ జరిగే అవకాశం ఉంది.

దోషుల్లో ఒకరైన గోవింద్ భాయ్ నాయి తన పిటిషన్ లో 88 ఏళ్ల తన తండ్రిని, 75 ఏళ్ల తల్లిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత తనపైనే ఉందని పేర్కొన్నారు. తన తండ్రి వృద్ధుడు అని, ఆయన ఆస్తమాతో బాధపడుతున్నారని, ఇటీవల యాంజియోగ్రఫీతో సహా శస్త్రచికిత్స చేయించుకున్నారని తెలిపారు. అలాగే హేమోరాయిడ్స్ చికిత్స కోసం మరో ఆపరేషన్ చేయాల్సి ఉందని పేర్కొన్నారు. తన సత్ప్రవర్తనను తెలియజేస్తూ.. విడుదల సమయంలో తాను చట్టాన్ని ఏ విధంగానూ ఉల్లంఘించలేదని, ఉపశమన క్రమాన్ని అక్షరాలా పాటించాను అని నాయి తన దరఖాస్తులో పేర్కొన్నారు.

దేశంలో పెరిగిన విమాన ప్రయాణీకుల సంఖ్య: హైద్రాబాద్‌లో వింగ్స్ 2024 ను ప్రారంభించిన సింధియా

మరో దోషి రమేష్ రూపాభాయ్ చందనా.. తన కుమారుడి పెళ్లి ఉందని, కాబట్టి లొంగి పోయేందుకు మరో ఆరు వారాల గడువు కోవాలని కోరారు. మూడో దోషి మితేష్ చిమన్లాల్ భట్ కూడా ఆరు వారాల పొడిగింపును అభ్యర్థించాడు. తన పంట శీతాకాల కోతకు సిద్ధంగా ఉందని, లొంగిపోయే ముందు ఆ పనిని పూర్తి చేయాలనుకుంటున్నానని పేర్కొన్నారు.

అసలేం జరిగిందంటే ? 
గుజరాత్ లో 2002 గోద్రా అనంతర అల్లర్ల సందర్భంగా బిల్కిస్ బానోపై అత్యాచారం జరిగింది. ఈ ఘటనలో ఆమె కుటుంబ సభ్యుల్లో ఏడుగురిని హత్య చేసిన కేసులో 11 మంది దోషులుగా తేలారు. వారు శిక్ష అనుభవిస్తున్న సమయంలో వారిని విడుదల చేయాలని గుజరాత్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే దీనిని సవాల్ చేస్తూ కోర్టులో పిటిషన్ దాఖలు అయ్యాయి.

బాలకృష్ణ వర్సెస్ జూనియర్ ఎన్టీఆర్.. ఫ్యాన్స్ వారా? ఫ్యామిలీవారా?

దీంతో గుజరాత్ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు జనవరి 8న రద్దు చేసింది. ఇలాంటి ఉత్తర్వులు జారీ చేసేంత అర్హత గుజరాత్ ప్రభుత్వానికి లేదని, ఇది మోసపూరిత చర్య అని కోర్టు వ్యాఖ్యానించింది. 11 మంది దోషులు 15 సంవత్సరాల జైలు శిక్షను పూర్తి చేసుకున్న తరువాత 2022 ఆగస్టు 15 న విడుదలయ్యారు. జైలులో వారి వయస్సు, ప్రవర్తనను పరిగణనలోకి తీసుకున్నారు.

2002 మార్చి 3న గుజరాత్ లో గోద్రా రైలు దగ్ధం ఘటన తర్వాత చెలరేగిన అల్లర్ల నుంచి తప్పించుకునే క్రమంలో బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారం జరిగినప్పుడు ఆమె వయసు 21 ఏళ్లు, ఐదు నెలల గర్భవతి. మృతి చెందిన ఏడుగురు కుటుంబ సభ్యుల్లో ఆమె మూడేళ్ల కుమార్తె కూడా ఉంది.

click me!