అయోధ్యలోని రామ మందిరంపై తపాలా స్టాంపులను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇవాళ విడుదల చేశారు.
న్యూఢిల్లీ: అయోధ్యలోని రామ మందిరంపై తపాలా స్టాంపులు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రాముడికి అంకితం చేసిన స్టాంపులతో కూడిన పుస్తకాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గురువారం నాడు విడుదల చేశారు.
undefined
48 పేజీల పుస్తకంలో అమెరికా, న్యూజిలాండ్, సింగపూర్, కెనడా, కంబోడియా, యూఎన్ వంటి సంస్థలతో సహా 20 దేశాలకు పైగా దేశాలు జారీ చేసిన స్టాంపులు ఈ పుస్తకంలో పొందుపర్చారు.
శ్రీరామ జన్మభూమి ఆలయంపై తపాల స్టాంపులను, ప్రపంచ వ్యాప్తంగా శ్రీరాముడిపై విడుదల చేసిన స్టాంపుల పుస్తకాన్ని ప్రధాని ఇవాళ విడుదల చేశారు.
మొత్తం ఆరు స్టాంపులు:రామ మందిరం, గణేశుడు, హనుమంతుడు, జటాయువు, కేవత్రాజీ, శబరి … pic.twitter.com/sARm0lPyYk
రామ మందిరం, హనుమంతుడు, గణేషుడు, జటాయువు, కేవట్రాజు, మాత శబరిపై ఆరు పోస్టల్ స్టాంపులున్నాయి.వివిధ సమాజాలపై శ్రీరాముడి ప్రభావం ఎలా ఉందో తెలిపే ఉద్దేశ్యంతోనే ఈ స్టాంప్ బుక్ ను విడుదల చేశారు. స్టాంపుల రూపకల్పనలో శ్రీరామ జన్మభూమి మందిరానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలకు చోటు కల్పించారు.
ఈ నెల 22న అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవం జరగనుంది.ఈ కార్యక్రమానికి శ్రీరామజన్మభూమి క్షేత్ర తీర్థ ట్రస్ట్ అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ఇప్పటికే రామ్ లల్లా విగ్రహం ఆలయానికి చేరుకుంది. అయోధ్యలోని రామ మందిరంలోని గర్భగుడిలో రామ్ లల్లా విగ్రహన్ని ప్రతిష్టించే అవకాశం ఉందని శ్రీరామ మందిర నిర్మాణ కమిటీ అధ్యక్షుడు నృపేంద్ర మిశ్రా చెప్పారు. అరుణ్ యోగిరాజ్ చెక్కిన 51 అంగుళాల విగ్రహం గర్బగుడిలో కొలువుకానుంది.
అయోధ్యలో రామ మందిర ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి దేశ విదేశాల్లో రాముడి భక్తులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు నిర్వాహకులు ఎంపిక చేసినవారికి ఆహ్వాన పత్రికలను పంపారు.