అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం రోజు దేశంలోోని పలు రాష్ట్రాలు సెలవులు ప్రకటించాయి. ఈ నేపథ్యంలోనే తెలుగు రాష్ట్రాల్లో కూడా స్కూళ్లకు సెలవులు ప్రకటించాలన్న డిమాండ్ ఏర్పడింది.
అయోధ్య : దేశంలోని మెజారిటీ ప్రజల శతాబ్దాల కల,దశాబ్దాల పోరాటం సాకారమయ్యింది. శ్రీ రాముడి జన్మభూమి అయోధ్యలో భవ్య రామమందిర నిర్మాణం పూర్తయి ప్రారంభోత్సవానికి సిద్దమయ్యింది. ఈ నెల 22న ప్రధాని నరేంద్ర మోదీతో పాటు దేశంలోని అతిరధమహారథుల సమక్షంలో రామయ్య విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమం జరగనుంది. ఈ రోజున ప్రజలంతా రామనామస్మరణ చేస్తూ దేవాలయాల్లో జరిగే ఆధ్యాత్మక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వీలుగా పలు రాష్ట్రాలు సెలవులు ప్రకటిస్తున్నాయి. ఇలా తెలుగు రాష్ట్రాల్లో కూడా స్కూళ్లకు సెలవు ప్రకటించాలన్న డిమాండ్ మొదలయ్యింది.
ఆంధ్ర ప్రదేశ్ లో సంక్రాంతి సెలవులను పొడిగించిన వైసిపి ప్రభుత్వం సరిగ్గా జనవరి 22న పున:ప్రారంభిస్తోంది. దీంతో ఆ ఒక్కరోజు కూడా సెలవులను పొడిగించాలని రాష్ట్ర బిజెపి అధ్యక్షురాలు పురంధీశ్వరి డిమాండ్ చేస్తున్నారు. అయోధ్య రామమందిరం అనేది దేశంలోని మెజారిటీ హిందూ ప్రజల శతాబ్దాల కల, దశాబ్దాల పోరాటం... అలాంటి ఆలయ ప్రారంభోత్సవం రోజున సెలవు ఇవ్వకపోవడం దారుణమని అన్నారు. ఇది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మనసులో విషపూర్తిత ఆలోచనలకు నిదర్శమని అన్నారు. పలు ప్రైవేట్ విద్యాసంస్థలు సెలవులు ప్రకటించాయి... అలాంటిది ప్రభుత్వం మాత్రం ఒక్కరోజు సెలవు పొడిగించలేదన్నారు.వెంటనే ఆంధ్ర ప్రదేశ్ లోని అన్ని స్కూళ్ళకు సెలవులు ప్రకటించాలని పురందీశ్వరి డిమాండ్ చేసారు.
undefined
ఇక తెలంగాణలోనే ఇదే డిమాండ్ వినిపిస్తోంది. అయోధ్య ఆలయ ప్రారంభోత్సవం నేపథ్యంలో వచ్చే సోమవారం స్కూళ్లకు సెలవులు ప్రకటించాలని బిజెపి నాయకులు, హిందూ సంఘాలు కోరుతున్నాయి.
Also Read School Holidays: స్కూల్స్‌కు సంక్రాంతి సెలవులు పొడిగింపు.. అదనంగా మరో మూడు రోజులు
ఇదిలావుంటే ఇప్పటికే అయోధ్య రామమందిరం కలిగిన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది యోగి ఆదిత్యనాథ్ సర్కార్. ఆ రోజు వైన్ షాప్స్ కూడా మూసివేయాలని బిజెపి ప్రభుత్వం ఆదేశించింది. ఆ రోజు ప్రజలంతా తమతమ ప్రాంతాల్లోని దేవాలయాల్లో జరిగే కార్యక్రమాల్లో పాల్గొనాలని యూపీ సర్కార్ సూచించింది.
ఇక బిజెపి పాలిత మరికొన్ని రాష్ట్రాల్లోనూ సెలవులు ప్రకటించారు. మధ్యప్రదేశ్, హర్యానా రాష్ట్రాల్లో విద్యాసంస్థలకు సెలవులతో పాటు మద్యం దుకాణాలను మూసివేయనున్నట్లు ప్రకటించారు. ఇక గోవా, చత్తీస్ ఘడ్ రాష్ట్రాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు.