
వారికి పెళ్లయి రెండు నెలలు అవుతోంది. దీనిని సెలబ్రేట్ చేసుకునేందుకు ఆ జంట తమ కొత్త స్కూటర్‌పై రైడ్ కు వెళ్లింది. అయితే ఓ ఫ్లై ఓవర్ పై వీరు ప్రయాణిస్తున్న బైక్ ను ఓ కారు వేగంగా వచ్చి ఢీకొంది. దీంతో బైక్ గాలితో పల్టీలు కొట్టి కింద పడిపోయింది. ఎత్తు నుంచి కింద పడటంతో కొత్త జంటకు తీవ్ర గాయలు అయ్యాయి. దీంతో వారు చనిపోయారు. ఈ ఘటన గుజరాత్ లో చోటు చేసుకుంది.
ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. అహ్మదాబాద్ కు చెందిన ఆటోమొబైల్ డీలర్ ద్వారకేష్ (34), ఓగ్నాజ్‌లోని పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న జూలీ (32) లకు మార్చి 28వ తేదీన వివాహం జరిగింది. వీరద్దరూ చంద్‌ఖేడాలోని అస్తా స్క్వేర్ ఫ్లాట్‌లలో నివసిస్తున్నారు. అయితే ఈ జంటకు పెళ్లయి రెండు నెలలు పూర్తి కావడంతో దానిని సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నారు. వారి కొత్త స్కూటీని తీసుకొని జాలీగా బయటకు వెళ్లి, రెస్టారెంట్ లో భోజనం చేసి ఇంటికి తిరిగి రావాలనుకున్నారు.
సూరత్ లో విషాదం.. బీచ్ లో ఈత కొడుతుండగా సముద్రంలోకి లాక్కుపోయిన అలలు.. ముగ్గురు మృతి
వారు అనుకున్న ప్లాన్ ప్రకారమే స్కూటీ తీసుకొని రెస్టారెంట్ కు వెళ్లారు. అక్కడ భోజనం చేసి తిరిగి స్కూటీపై వస్తున్నారు. తరువాత షాపింగ్ కూడా చేసి స్కూటీపై బయలు దేరారు. వీరి స్కూటీ సోలా ఫ్లై ఓవర్ కు చేరుకునే సరికి ఓ గుర్తు తెలియని కారు వచ్చి వీరిని ఢీకొట్టింది. దీంతో స్కూటీ పల్టీలు కొట్టింది. ఈ కొత్త జంట ఫ్లై ఓవర్ పైనుంచి కింద పడింది. దీంతో వారికి తీవ్ర గాయాలు అయ్యాయి. ‘‘ వారి తల, ముఖానికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని సోలా సివిల్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే ఈ జంట పరిస్థితిని పరీక్షించిన డాక్టర్లు వారు అప్పటికే చనిపోయినట్లు ప్రకటించారు ’’ అని SG-1 ట్రాఫిక్ పోలీసు అధికారి తెలిపారు.
ఈ ప్రమాదంపై ద్వారకేష్ తండ్రి హస్ముఖ్ వానియా మాట్లాడుతూ... కొత్త జంట ఇటీవలే స్కూటీ కొనుగోలు చేసిందని తెలిపారు. పెళ్లయి రెండు నెలలు పూర్తి అయిన సందర్భంగా సరదాగా బయటకు వెళ్లారని చెప్పారు. అయితే ఆదివారం అర్ధరాత్రి 12.30 గంటలకు ద్వారకేశ్, జూలీ ప్రమాదానికి గురయ్యారని, వారిని సోలా సివిల్ ఆస్పత్రికి తరలించారని గుర్తు తెలియని వ్యక్తి తన కూతురు కాల్ చేశారని చెప్పారు. దంపతులు మొదట షాపింగ్‌కి వెళ్లి, ఫుడ్ పార్శిల్ తీసుకొని ఇంటికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని హస్ముఖ్ ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.
కాగా ఈ ప్రమాదానికి కారణమైన గుర్తు తెలియని కారు డ్రైవర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ‘‘ డ్రైవర్ పరారీలో ఉన్నాడు.ఈ కేసులో దర్యాప్తు జరుగుతోంది ’’అని పోలీసు అధికారి తెలిపారు. అయితే ఈ ప్రమాదం నేపథ్యంలో ఈ ఫ్లైఓవర్ భద్రతా ప్రమాణాలపై అనేక ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. వాహనాదారుల సెఫ్టీ ఇక్కడ అస్సలు కనిపించడం లేదు. బ్రిడ్జిపై రెయిలింగ్‌లు చాలా తక్కువగా ఉన్నాయి. అందుకే స్కూటీని కారు ఢీకొన్నప్పుడు అది వెళ్లి కింద పడిందని పోలీసులు తెలిపారు. ఒక వేళ రైలింగ్ ఉంటే స్కూటీ ఫ్లై ఓవర్ నుంచి పడి ఇంత పెద్ద స్థాయిలో ప్రమాదం జరిగి ఉండకపోయేదని పోలీసు వర్గాలు వెల్లడించాయి.