
రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆరోగ్యానికి సంబంధించిన మరో విషయం మళ్లీ బయటకు వచ్చింది. ఆయన వేగంగా పురోగమిస్తున్న క్యాన్సర్ వల్ల కంటిచూపును కోల్పోతున్నారని రష్యా ఇంటెలిజెన్స్ అధికారి ఒకరు పేర్కొన్నారు. ఆయన మరెంతో కాలం బతకరని చెప్పారు. ఉక్రెయిన్, రష్యాకు మధ్య యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో ఈ వార్త ఎన్నో ఊహాగానాలకు దారి తీసింది. అయితే ఈ వార్తలన్నింటీనీ రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ మాత్రం ఖండించారు. పుతిన్ ఆరోగ్యంగానే ఉన్నారని చెప్పారు.
విమానం నడుపుతూనే నిద్రలోకి జారుకున్న పైలట్లు.. టెర్రరిస్టులు హైజాక్ చేశారేమోనని.. !
UKలో నివసిస్తున్న మాజీ రష్యన్ గూఢచారి బోరిస్ కార్పిచ్‌కోవ్‌కు పంపిన సందేశంలో పుతిన్ ఆరోగ్యం విషయంలో FSB అధికారి తాజాగా పలు వివరాలు వెల్లడించారని ‘ఇండిపెండెంట్’ తన నివేదికలో తెలిపింది. ‘‘ అతను (పుతిన్) తలనొప్పితో బాధపడుతున్నాడని మాకు తెలిసింది. టీవీలో కనిపించే సమయంలో ఆయన ప్రసగించేందుకు, చదవడానికి పెద్ద అక్షరాలతో కూడిన కాగితం ముక్కలు అవసరం. ప్రతీది అందులో ఉండాలి. అవి చాలా పెద్దవి. ప్రతీ పేజీలో కొన్ని వ్యాఖ్యలు మాత్రమే ఉండాలి. అతడి కంటి చూపు తీవ్రంగా క్షీణిస్తోంది ’’ అని news.com.au విడుదల చేసిన సందేశంలో ఒక భాగం పేర్కొంది.
మిస్టర్ పుతిన్ అవయవాలు ఇప్పుడు అనియంత్రితంగా కూడా వణుకుతున్నాయి అని మెట్రో, ఎక్స్ ప్రెస్ నివేదించాయి. ఈ నెల ప్రారంభంలో కూడా పుతిన్ తన పొత్తికడుపు నుండి ద్రవాన్ని తొలగించడానికి ఆపరేషన్ చేయించుకున్నట్టు ఒక వార్తను ఎక్స్ ప్రెస్ ప్రచురించింది. ఈ ఆపరేషన్ ‘‘ సమస్యలు లేకుండా చక్కగా సాగింది ’’ అంటూ రష్యా విదేశీ ఇంటెలిజెన్స్ సర్వీస్ తో సంబంధం ఉన్న టెలిగ్రామ్ అనుసంధానంగా ఉన్న టెలిగ్రామ్ ఛానెల్ జనరల్ SVR సమాచారాన్ని ఆపాదిస్తూ నివేదిక పేర్కొంది.
Nepal plane crash: నేపాల్ లో ఘోర విమాద ప్రమాదం.. నలుగురు భారతీయులతోపాటు 22 మంది ..
పుతిన్ ఆరోగ్యంపై వస్తున్న వార్తలను రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ పూర్తిగా ఖండించారు. ‘‘బుద్ధిగల వ్యక్తులు ఈ వ్యక్తిలో ఏదో ఒక రకమైన అనారోగ్యం లేదా అనారోగ్యం సంకేతాలను చూడగలరని నేను అనుకోను ’’ అని ఫ్రాన్స్ కు చెందిన బ్రాడ్‌కాస్టర్ TF1 నుంచి ఒక ప్రశ్నకు సమాధానంగా ఆయన తెలిపారు. అక్టోబర్‌లో 70 ఏళ్లు నిండే రష్యా అధ్యక్షుడు ప్రతిరోజూ బహిరంగంగా కనిపిస్తారని లావ్‌రోవ్ తెలిపారు. ‘‘ మీరు ఆయనను స్క్రీన్‌లపై చూడవచ్చు. పుతిన్ ప్రసంగాలను చదవవచ్చు, వినవచ్చు’’ అని రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన వ్యాఖ్యలలో ఆయన పేర్కొన్నారు.
Monkeypox: 23 దేశాల్లో 257 కేసులు.. వారిపై మంకీపాక్స్ అధిక ప్రభావం.. WHO హెచ్చరిక
కాగా పుతిన్ అనారోగ్యంపై వార్తలు రావడం ఇదే మొదటి సారి కాదు. గతంలో కూడా ఒక సారి ఆయన బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్నారని పలు మీడియా సంస్థలు పేర్కొన్నాయి. రష్యాలో అధికార పార్టీకి అత్యంత సన్నిహితుడిగా ఉన్న ఓ వ్యక్తి ఈ విషయాన్ని వెల్లడించారని తెలిపాయి. దీంతో ప్రపంచ దేశాలన్నింటిటీ పుతిన్ ఆరోగ్యం విషయంలో చర్చలు జరిగాయి. మళ్లీ తాజాగా అలాంటి నివేదికలే వెలువడ్డాయి. ఫిబ్రవరి 24వ తేదీన పుతిన్ తన సేనలను ఉక్రెయిన్ పై యుద్దానికి పంపించిన సంగతి అందరికీ తెలిసిందే. ఇంకా ఆ యుద్ధం కొనసాగుతూనే ఉంది.