
దేశ రాజధాని ఢిల్లీలోని అశోక రోడ్డులోని హై సెక్యూరిటీ ఏరియాలో ఉన్న ఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఇంటిపై దాడి జరిగింది. తలుపుపై ఉన్న రెండు గ్లాస్ ప్యానల్స్ పగిలిపోయాయి. ఈ విషయాన్ని ఢిల్లీ పోలీసులు సోమవారం తెలిపారు. ఆదివారం సాయంత్రం 5 గంటల సమయంలో ఇంట్లోని కేర్ టేకర్ పగిలిన అద్దాలను గమనించి పోలీసులకు చేశారు.
కాగా.. ఈ దాడి జరిగిన సమయంలో ఒవైసీ ఇంట్లో లేరు. ఘటనా స్థలంలో రాళ్లు గానీ, అద్దాలు పగులగొట్టే ఇతర వస్తువులు గానీ తమకు లభించలేదని సీనియర్ పోలీసు అధికారులు చెబుతున్నారు. ‘అద్దాలు పగులగొట్టేందుకు ఉపయోగించిన రాళ్లు మాకు దొరకలేదు. ఈ ఘటనపై తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది’’ అని పోలీసులు చెప్పిన్టటు ‘హిందుస్థాన్ టైమ్స్’పేర్కొంది.
మద్యానికి డబ్బులిచ్చి.. చికెన్ కర్రీ వండి భర్తను ప్రియుడి దగ్గరికి పంపిన భార్య.. తరువాత ఏమైందంటే ?
నాలుగుసార్లు హైదరాబాద్ నుంచి ఎంపీగా లోకసభకు ఎన్నికైన ఒవైసీకి ఢిల్లీలో ఉన్న అధికారిక నివాసంపై దాడి జరగడం ఈ ఏడాదిలో ఇది రెండోసారి. ఫిబ్రవరి 19వ తేదీన కూడా పలువురు దుండగులు ప్రవేశ ద్వారం వద్ద రాళ్లు విసిరి నేమ్ ప్లేట్ ను ధ్వంసం చేశారు. 2014 తర్వాత తన నివాసంపై దాడి జరగడం ఇది నాలుగోసారి అని ఓవైసీ ట్వీట్ చేశారు.