ఉత్తరాదిలో ప్రకృతి విలయం .. హిమాచ‌ల్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ను ముంచెత్తిన వరదలు

Published : Aug 14, 2023, 01:24 PM ISTUpdated : Aug 14, 2023, 01:51 PM IST
ఉత్తరాదిలో ప్రకృతి విలయం .. హిమాచ‌ల్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ను ముంచెత్తిన  వరదలు

సారాంశం

హిమాచ‌ల్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. గతవారం రోజులుగా కురుసున్న వర్షాల కారణంగా కారణంగా అనేక ప్రాంతాల్లో వరదలు, కొండచరియలు విరిగిపడుతున్నాయి.

ఉత్తరాదిలో ప్రకృతి విలయతాండవం చేస్తున్నది. ప్రధానంగా హిమాచ‌ల్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. గతవారం రోజులుగా కురుసున్న వర్షాల కారణంగా కారణంగా అనేక ప్రాంతాల్లో వరదలు, కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఈ తరుణంలో బియాస్ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. సోమవారం నాడు భారీ వర్షాల కారణంగా సిమ్లాలోని సమ్మర్ హిల్ ప్రాంతంలోని శివాలయం కుప్పకూలింది.  ఈ భారీ ప్రమాదంలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాద సమయంలో   25 నుండి 30 మంది ఆలయంలో ఉన్నట్టు పోలీసులు అంచనా వేస్తున్నారు. 
 
ఈ విషయంపై సిఎం సుఖ్వీందర్ సుఖు ఆందోళనను వ్యక్తం చేస్తూ..  వినాశకరమైన వర్షాల కారణంగా..  సిమ్లాలోని సమ్మర్‌హిల్ సమీపంలోని శివ మందిర్ సమీపంలో కొండచరియలు విరిగిపడ్డాయి. దీని కారణంగా చాలా మంది సమాధి అయ్యారు. కొంతమంది విషాదకరంగా మరణించారు. అని సిఎం ట్వీట్ చేశారు. తాను సంఘటనా స్థలంలో ఉన్నాననీ, యుద్ధ ప్రాతిపదికన రెస్క్యూ పనులు జరుగుతున్నాయని,  శిథిలాల కింద చిక్కుకున్న ప్రజలను రక్షించడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. 
 
హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు, వరదల కారణంగా 20 మందికి పైగా మరణించారు. ప్రకృతి వైపరీత్యానికి గురైన మండి జిల్లాలో గత మూడు రోజులుగా 13 మంది చనిపోయారు. అలాగే.  సోలన్ జిల్లాలో ఏడుగురు మరణించారు. రాష్ట్రంలో పలు విధ్వంసకర పరిస్థితులు కొనసాగుతున్నాయని తెలిపారు. 
 
వాతావరణ శాఖ నుండి అందిన సమాచారం ప్రకారం.. రుతుపవనాలు రానున్న 24 గంటలపాటు చురుకుగా ఉంటాయి. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో నదులు, కాలువలు, గుంతలు పొంగిపొర్లుతున్నాయి.   
ధరంపూర్‌లోని తాన్యాహాద్ పంచాయతీలోని నల్యానాలో మురుగునీరు ఇంట్లోకి చేరడంతో ముగ్గురు వ్యక్తులు సమాధి అవుతున్నట్లు సమాచారం. అదే సమయంలో నహాన్‌లోని కందైవాలాలో ఆదివారం అర్థరాత్రి మేఘాల విస్ఫోటనం కారణంగా 50 ఇళ్లు శిధిలాలతో నిండిపోయాయి. చాలా ప్రాంతాలు పొగమంచుతో కప్పబడి ఉన్నాయి

చురా, సలోని సహా జిల్లాలోని కొండ ప్రాంతం పూర్తిగా పొగమంచుతో కప్పబడింది.మరోవైపు ప్రతికూల వాతావరణంలో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని జిల్లా యంత్రాంగం సూచించింది. దీంతో పాటు డ్రైవర్లు కూడా భద్రతను దృష్టిలో ఉంచుకుని వాహనం తీసుకెళ్లాలని సూచించారు.

PREV
click me!

Recommended Stories

Viral News: ఈ గ్రామంలో మ‌హిళ‌లు 5 రోజులు న‌గ్నంగా ఉంటారు.. వింత ఆచారం ఎక్క‌డంటే
Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌