బీజేపీకి ఓట్లేసి, సపోర్ట్ చేసే వారంతా రాక్షసులు- కాంగ్రెస్ ఎంపీ రణ్ దీప్ సింగ్ సుర్జేవాలా వివాదాస్పద వ్యాఖ్యలు

Published : Aug 14, 2023, 01:12 PM IST
బీజేపీకి ఓట్లేసి, సపోర్ట్ చేసే వారంతా రాక్షసులు- కాంగ్రెస్ ఎంపీ రణ్ దీప్ సింగ్ సుర్జేవాలా వివాదాస్పద వ్యాఖ్యలు

సారాంశం

కాంగ్రెస్ నేత, రాజ్యసభ సభ్యుడు రణ్ దీప్ సింగ్ సుర్జేవాలా బీజేపీ, ఆ పార్టీ మద్దతుదారులను ఉద్దేశించి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. ఇవి ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి. దీనిపై బీజేపీ నాయకులు మండిపడుతున్నారు.

బీజేపీ నాయకులను, ఆ పార్టీకి ఓట్లేసి, సపోర్ట్ చేసే వారిని కాంగ్రెస్ నాయకుడు, రాజ్యసభ ఎంపీ రణ్ దీప్ సింగ్ సుర్జేవాలా రక్షసులతో పోల్చారు. ఓ కార్యక్రమంలో ఆయన ఈ పదాలను ఉపయోగించడం ఇప్పుడు వివాదాస్పదమైంది. హర్యానాలోని కైతాల్ లో ఆదివారం జరిగిన కాంగ్రెస్ 'జన్ ఆక్రోష్ ర్యాలీ'లో సుర్జేవాలా పాల్గొని మాట్లాడారు. ‘‘ఉద్యోగం ఇవ్వకండి, కనీసం ఉద్యోగంలో కూర్చోవడానికి అవకాశం ఇవ్వండి. బీజేపీ, జేజేపీలో నాయకులు రాక్షసులు. బీజేపీకి ఓటేసి, వారికి మద్దతిచ్చే వారు కూడా రాక్షసులే. ఈ రోజు నేను ఈ మహాభారత భూమి నుండి శపిస్తున్నాను.’’ అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

మద్యానికి డబ్బులిచ్చి.. చికెన్ కర్రీ వండి భర్తను ప్రియుడి దగ్గరికి పంపిన భార్య.. తరువాత ఏమైందంటే ?

ఈ ప్రసంగానికి సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వాటిని పలువురు బీజేపీ నాయకులు కూడా షేర్ చేశారు. అయితే ఈ వీడియోపై బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర స్పందించారు.  రణ్ దీప్ సింగ్ సుర్జేవాలాపై మండిపడ్డారు. 

యువరాజు (రాహుల్ గాంధీ)ను పదేపదే లాంచ్ చేయడంలో విఫలమైన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రజలను, జనార్ధన్ ను దూషించడం ప్రారంభించిందని ఆరోపించారు. ‘‘ప్రధాని మోడీ, బీజేపీ వల్ల అంధత్వానికి గులైన కాంగ్రెస్ నేత రణ్ దీప్ సూర్జేవాలా చెప్పిన మాటలు వినండి’’ అంటూ ఆయన ఈ వీడియోను షేర్ చేస్తూ ట్వీట్ చేశారు.

ఉత్తరాఖండ్ లో భారీ వర్షాలు.. క్షణాల్లో కుప్పకూలిన డెహ్రాడూన్ డిఫెన్స్ కాలేజీ.. వీడియో వైరల్

మరో  బీజేపీ నాయకుడు గౌరవ్ భాటియా కూడా సుర్జేవాల వ్యాఖ్యలపై మండిపడ్డారు. రాహుల్ గాంధీని లాంచ్ చేయడంలో విఫలమైన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తన ఆగ్రహాన్ని ప్రజలపై ప్రదర్శిస్తోందని విమర్శించారు. ‘‘ బీజేపీకి ఓటేసిన దేశ ప్రజలు రాక్షసులు అని రణదీప్ సూర్జేవాలా మాట్లాడారు. దేశంలోని ఏ పార్టీకైనా ఓటు వేయడం, ఏ పార్టీకైనా మద్దతు ఇవ్వడం పౌరుడి హక్కు అని ఖంగ్రే (కాంగ్రెస్) అర్థం చేసుకోవాలి. మీ భాషకు, ఆలోచనలకు మీరే దేశద్రోహులు’’ అని పేర్కొన్నారు. 
 

PREV
click me!

Recommended Stories

Viral News: ఈ గ్రామంలో మ‌హిళ‌లు 5 రోజులు న‌గ్నంగా ఉంటారు.. వింత ఆచారం ఎక్క‌డంటే
Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌