Anand Mahindra: హిమాల‌య ప‌ర్వ‌తాల‌పై భార‌త సైనికుల‌ కబడ్డీ.. ఆనంద్‌ మహీంద్రా పోస్టు వైర‌ల్

Published : Mar 14, 2022, 07:08 AM ISTUpdated : Mar 14, 2022, 08:04 AM IST
Anand Mahindra:  హిమాల‌య ప‌ర్వ‌తాల‌పై భార‌త సైనికుల‌ కబడ్డీ.. ఆనంద్‌ మహీంద్రా పోస్టు వైర‌ల్

సారాంశం

Anand Mahindra: సోషల్‌ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) తాజా హిమాలయాల్లోని ఎత్తైన కొండలపై కబడ్డీ ఆడుతున్న భార‌త‌ సైనికులు మీడియాను పోస్టు చేశారు. ఈ వీడియోకు వ్యూస్ వ‌ర‌ద‌ల వ‌స్తున్నాయి.   

Anand Mahindra: ఆనంద్ మహీంద్రా.. నెట్టింటి వాసుల‌కు ప‌రిచ‌యం అక్క‌ర‌ల్లేని పేరు. నిత్యం ఆసక్తికర విషయాలను పంచుకుంటూ.. సోషల్‌ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటారు మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా. తన కార్లను, కంపెనీని ఎలా ప్రమోట్ చేసుకోవాలో ఆయనకు బాగా తెలుసు. అలాగే.. సోషల్ మీడియాను ఎలా వాడాలో కూడా బాగా తెలిసిన నేర్ప‌రి. ఆయన పెట్టే వీడియోలు, రాసే కామెంట్స్ చూసేందుకు ఎంతో ఆతృత కనబరుస్తారు నెటిజన్లు. 

ఈ వ్యాపార వేత్త‌..  తాజాగా ఓ వీడియోను త‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా పంచుకున్నారు. మంచుకొండల్లో భారత సైనికులు కబడ్డీ ఆడుతున్న వీడియోను ఆయ‌న పోస్ట్‌ చేశారు. త‌న‌దైన శైలిలో క్యాప్ష‌న్ రాసుకోచ్చారు.  ‘ భార‌త దేశ‌ ప్రాచీన క్రీడల్లో కబడ్డీ ఒక్క‌టి. ఈ క‌బ‌డ్డీని ఎక్కడైనా, ఎప్పుడైనా, ఎలాంటి ప్రదేశంలోనా ఆడొచ్చు. అదే ఈ క్రీడాకు ఉన్న అందం ఇదే.  అందుకే మ‌న‌ క్రీడల‌ పునరుద్ధరణకు ప్ర‌తి ఒక్క‌రూ ప్రోత్సాహించాలి. క‌బడ్డీ  ప్రదర్శించాల్సిన ఒకేఒక్క అంశం వీరత్వం’ అంటూ ఆస‌క్తిక‌రంగా రాసుకోచ్చారు. ఆనంద్‌ మహీంద్రా  భారత్‌లో నిర్వహిస్తున్న ‘ప్రోకబడ్డీ’ లీగ్‌కు కో-ఫౌండర్‌గా ఉన్న విషయం అందరికీ తెలిసిందే.

హిమాలయా ప‌ర్వ‌తంపై గ‌ట్టిన చలిని మ‌యమ‌రిచి, ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్(ఐటీబీపీ)కి చెందిన భార‌త‌ సైనికులు కబడ్డీ ఆడుతున్నారు.  దట్టమైన మంచు కురుస్తుండగా  కాసేపు కబడ్డీ.. కబడ్డీ.. అంటూ పోటీపడ్డారు. చ‌ల్ల‌ని ప్ర‌కృతి ఒడిలో.. హిమాల‌య ప‌ర్వ‌త సానువుల అంచున ఆడిన సైనికుల ఆట చూప‌రుల‌ను ఇట్టే ఆక‌ర్షిస్తుంది.  ఇందుకు సంబంధించిన వీడియోను ఐటీబీపీ ట్విటర్‌ వేదికగా పంచుకుంది. కాగా ఈ వీడియోను మహీంద్రా రీ ట్వీట్‌ చేస్తూ హర్షం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఆనంద్ మహేంద్ర త‌రుచు ఎదోక ఆస‌క్తికర వీడియోను పోస్టు చేస్తూ.. నెట్టింట్లో సంద‌డి చేస్తారు. 
 

PREV
click me!

Recommended Stories

మంచులో దూసుకెళ్లిన వందే భారత్: Tourists Reaction | Katra–Srinagar | Snow Train | Asianet News Telugu
Viral Video: అంద‌మైన ప్ర‌కృతిలో ఇదేం ప‌ని అమ్మాయి.? బికినీ వీడియోపై ఫైర్ అవుతోన్న నెటిజ‌న్లు