Mamata Banerjee: ‘యూపీ విజయానికి బీజేపీ ఇచ్చిన‌ గిప్ట్ కార్డు’: ఈపీఎఫ్ రేటు తగ్గింపుపై దీదీ ఫైర్

Published : Mar 14, 2022, 03:18 AM IST
Mamata Banerjee: ‘యూపీ విజయానికి బీజేపీ ఇచ్చిన‌ గిప్ట్ కార్డు’: ఈపీఎఫ్ రేటు తగ్గింపుపై దీదీ ఫైర్

సారాంశం

Mamata Banerjee: ఉద్యోగుల భవిష్య నిధి(ఈపీఎఫ్‌) పొదుపుపై ​​వడ్డీ రేట్లను తగ్గించాలని ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ప్రతిపాదించ‌డాన్ని తీవ్రంగా ఖండిచారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. యూపీలో బీజేపీ విజ‌యం సాధించిన త‌రువాత‌.. కేంద్రప్ర‌భుత్వం అందించిన గిప్ట్ కార్డు అని వ్యంగ్యంగా స్పందించారు.  

Mamata Banerjee: ఉద్యోగుల భవిష్య నిధి(ఈపీఎఫ్‌) పొదుపుపై వడ్డీ రేటును  త‌గ్గించడాన్ని ప‌శ్చిమ బెంగాల్‌ సీఎం, తృణమూల్‌ అధినేత్రి మమత బెనర్జీ తీవ్రంగా ఖండించారు. ఉత్తరప్రదేశ్‌లో  బీజేపీ గెలిచిన వెంటనే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వేతన జీవులకు ఇచ్చిన ‘గిఫ్ట్‌కార్డు’ ఇది అని ఆదివారం ట్విట్టర్‌లో వ్యంగ్యంగా విమర్శించారు. ఈ ప్రజావ్యతిరేక నిర్ణయాన్ని ఐక్య పోరాటాల ద్వారా అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. ఇది ప్రజా, కార్మికుల వ్యతిరేక చర్య అని అన్నారు. 

ఇప్పటికే కరోనా సంక్షోభంతో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న మధ్య, దిగువ తరగతి, వేత‌న జీవుల‌కు  కేంద్రం నిర్ణయం పెద్ద పిడుగుపాటు అని ఆందోళన వ్యక్తం చేశారు. మోదీ సర్కార్‌ రైతులు, కార్మికులు, మధ్యతరగతి ప్రజలను విస్మరిస్తూ.. కార్పొరేట్లకు లబ్ధి చేకూరుస్తూ వారిని నెత్తిన పెట్టుకుంటున్నదని విమర్శించారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీలు..  రిటైర్మెంట్ సేవింగ్స్ స్కీమ్‌పై సబ్‌స్క్రైబర్‌ల వడ్డీ రేటును 2021-'22కి ప్రస్తుతమున్న 8.5% నుండి 4 దశాబ్దాల కనిష్టస్థాయి 8.1%కి తగ్గించాలని ప్రతిపాదించారు.  

తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మాట్లాడుతూ.. రైతులు, కార్మికులు మరియు మధ్యతరగతుల నష్టాలతో పెద్ద పెట్టుబడిదారుల ప్రయోజనాలను సమర్థించే ప్రస్తుత కేంద్రం త‌న క్రూరమైన లోపభూయిష్ట ప్రజా విధానాలను ఈ చర్య బహిర్గతం చేస్తుందని అన్నారు. ఈ ప్రకటనకు వ్యతిరేకంగా ఐక్య నిరసనలకు పిలుపునివ్వాల‌ని, క‌లిసి పోరాడాల‌ని బెనర్జీ అన్నారు.

గత యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ ప్రభుత్వ హయాంలో ఈపీఎఫ్ రేట్లు ఎప్పుడూ 8.5% నుంచి 9.5% మధ్య ఉండేవని కాంగ్రెస్ ఎంపీ మల్లికార్జున్ ఖర్గే అన్నారు.  అది పొదుపు లేదా FD రేటు కావచ్చు, పేద, మధ్యతరగతి యొక్క సురక్షితమైన బ్యాంకింగ్ సాధనాలు అధిక ద్రవ్యోల్బణం సమయంలో చాలా తక్కువ రాబడిని అందిస్తున్నాయని ఆయన చెప్పారు.
 
భారత కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్ట్) ఈ ప్రకటనను తీవ్రంగా ఖండించింది. శ్రామిక ప్రజలపై ప్ర‌భుత్వం చేస్తున్న‌ దుర్మార్గపు దాడిగా అభివర్ణించింది. పెరుగుతున్న వ్య‌యాలు, ధరల పెరుగుదల మొదలైన వాటితో వేత‌న జీవి తీవ్ర కష్టాల్లో ప‌డ్డాడ‌ని అన్నారు.  ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్లపై కేంద్రం ప్రతిపాదించిన వడ్డీ రేటు నాలుగు దశాబ్దాల కనిష్ట స్థాయి అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.
 
ఈ చ‌ర్య వ‌ల్ల‌.. దాదాపు 60 మిలియన్లపై దీని ప్రభావం ప‌డ‌నున్న‌ది.  20 మంది కంటే ఎక్కువ మంది కార్మికులు ఉన్న కంపెనీల్లో నెలకు రూ.15,000 వరకు సంపాదిస్తున్న కార్మికులకు ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలు తప్పనిసరి. ఒక ఉద్యోగి ప్రాథమిక జీతంలో కనీసం 12% తప్పనిసరిగా ప్రావిడెంట్ ఫండ్‌లో డిపాజిట్ చేయాల‌ని, యజమాని కూడా సమాన మొత్తాన్ని అందజేస్తారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Top 5 Dirtiest Railway Stations : దేశంలోనే అత్యంత మురికి రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?
IT Jobs : ఇక TCS లో ఉద్యోగాలే ఉద్యోగాలు