
JeM terrorists arrested: దక్షిణ కాశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో జైషే మహ్మద్ (JeM) సంస్థతో సంబంధం ఉన్న నలుగురు క్రియాశీల సహచరులను జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. నిందితులను ఇంతియాజ్ అహ్మద్ రాథర్, నసీర్ అహ్మద్ మాలిక్, రయీస్ అహ్మద్ షేక్, యావర్ రషీద్ ఘనీగా పోలీసులు గుర్తించారు. వీరంతా జైషే మహ్మద్ ఉగ్రవాదులకు రవాణా, ఇతర సౌకర్యాలను కల్పిస్తున్నారని పోలీసులు తెలిపారు.
"పి/ఎస్ పుల్వామాకు చెందిన 2022 ఎఫ్‌ఐఆర్ నంబర్ 50, 51 కేసులో నిందితులైన ఉగ్రవాదులకు, వారి చర్యలతో పాటు.. వారి సరుకుల రవాణా, ఇతర సౌకర్యాలను అందించే జెఎమ్ సంస్థతో 4 యువకులు చురుకుగా సంబంధం కలిగి ఉన్నారని నిర్ధారించబడింది", అని పోలీసు ప్రకటన. అన్నారు.
నిందితులను చేవా కల్లాన్ నివాసి ఇంతియాజ్ అహ్మద్ రాథర్, వసూరా నివాసి నసీర్ అహ్మద్ మాలిక్ (మదరసా అడ్మినిస్ట్రేటర్), ఖాన్‌పోరా న్యూవా నివాసి రయీస్ అహ్మద్ మరియు గూడూరా పుల్వామాకు చెందిన యావర్ రషీద్ గనైగా గుర్తించారు.
"12-03-2022 (శనివారం)న చెవా కల్లాన్ వద్ద జరిగిన ఆపరేషన్‌లో నిషేధిత సంస్థ జైషే-ఈ- మహ్మద్ సంస్థకు చెందిన ఇద్దరు మిలిటెంట్లు హతమయ్యారని, ఒక ఉగ్రవాది సజీవంగా పట్టుబడ్డాడని పేర్కొన్నారు. ఈ రెండు కేసులపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.