Thailand: భారతీయులకు థాయ్‌లాండ్ సర్కార్ బంపర్ ఆఫర్.. ఇంతకీ ఆ ఆఫరేంటీ?

By Rajesh Karampoori  |  First Published Oct 31, 2023, 6:16 PM IST

Thailand:  థాయ్‌లాండ్‌ (Thailand) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారతీయులకు శుభవార్త చెప్పింది. ఇంతకీ ఆ దేశం ఏ ఆఫర్ చేస్తోంది. 


Thailand: భారతీయులకు థాయ్‌లాండ్ (Thailand) ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇకపైనా వీసా అవసరం లేకుండానే భారతీయులు తమ దేశంలో పర్యటించేందుకు అనుమతి ఇస్తున్నట్టు థాయ్ ప్రభుత్వం తెలిపింది. అయితే.. ఈ  అద్భుత అవకాశాన్ని ఈ ఏడాది నవంబర్ 10 నుంచి వచ్చే ఏడాది మే 10 వరకు ఉపయోగించుకోవచ్చని వెల్లడించింది. ఈ మధ్య కాలంలో  వీసా లేకుండానే థాయ్‌లాండ్‌లో భారతీయులు పర్యటించవచ్చు. పర్యాటకులను ఆకర్షించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ దేశ ప్రధాని శ్రేత్తా తవిసిన్ తెలిపారు. 

ఈ సందర్భంగా థాయ్ అధికార ప్రతినిధి చాయ్ పచరొంకే మీడియాతో మాట్లాడుతూ.. భారత్, తైవాన్ నుంచి వచ్చేవారు వీసా లేకుండానే దాదాపు 30 రోజులపాటు థాయ్‌లాండ్‌లో పర్యటించవచ్చనని తెలిపారు. తమ దేశ ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడానికి, పర్యటక రంగాన్ని ప్రోత్సహించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు.  థాయిలాండ్ లో పర్యటించే వారిలో మలేషియా, చైనా, దక్షిణ కొరియా దేశీయులు మొదటి మూడు స్థానాల్లో నిలువుగా .. నాల్గొవ స్థానంలో భారత్ నిలించింది. కాగా.. ఎక్కువ మంది సందర్శకులను ఆకర్షించడానికి థాయ్‌లాండ్ ఇప్పటికే సెప్టెంబరులో చైనీస్ పర్యాటకులకు వీసా మినహాయింపును ఇచ్చింది.

Latest Videos

 థాయిలాండ్ పర్యాటక శాఖ గణాంకాల ప్రకారం.. ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్ వరకు దాదాపు 22 మిలియన్ల మంది థాయ్‌లాండ్‌లో పర్యటించారు. ఈ క్రమంలో పర్యటక రంగం నుంచి  ఆ దేశానికి దాదాపు 25.67 బిలియన్ అమెరికన్ డాలర్ ఆదాయం చేకూరింది. ఎయిర్‌లైన్స్, హాస్పిటాలిటీ చైన్‌లు ఆ మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకోవడంతో భారతదేశం నుండి ఇన్‌బౌండ్ టూరిజం వృద్ధి సంకేతాలను చూపించిందనీ,  థాయ్‌లాండ్ ఈ సంవత్సరం సుమారు 28 మిలియన్ల పర్యటకులు తమ దేశంలో పర్యటించాలని  లక్ష్యంగా పెట్టుకుంది. థాయ్ కొత్త ప్రభుత్వం ప్రయాణ రంగం ఆర్థిక వృద్ధిని నిరోధించే బలహీన ఎగుమతులను భర్తీ చేయగలదని ఆశిస్తోంది.

click me!