మీ టీచర్ రమ్మంటున్నదని చెప్పి స్టూడెంట్‌ను తీసుకెళ్లి హత్య.. టీచర్ బాయ్‌ఫ్రెండ్‌ అరెస్టు

By Mahesh K  |  First Published Oct 31, 2023, 5:21 PM IST

ఉత్తరప్రదేశ్‌లో పదోతరగతి చదువుతున్న 17 ఏళ్ల బాలుడి హత్య జరిగింది. ఆ బాలుడికి ట్యూషన్ చెబుతున్న టీచర్ బాయ్ ఫ్రెండ్ ఈ హత్య చేసినట్టు పోలీసులు తెలిపారు. ఆ తర్వాత బాలుడి కుటుంబానికి డబ్బులు ఇవ్వాలని బెదిరింపు లేఖ పంపించారు.
 


లక్నో: ఉత్తరప్రదేశ్‌లో ఓ 17 ఏళ్ల విద్యార్థి హత్య జరిగింది. ఆ బాలుడికి ట్యూషన్ చెబుతున్న టీచర్ బాయ్ ఫ్రెండ్ ఈ హత్యకు పాల్పడ్డట్టు తేలింది. ఆ తర్వాత బాలుడి కుటుంబానికి ఓ బెదిరింపు లేఖ అందింది. పెద్ద మొత్తంలో డబ్బు అందించాలని బెదిరించారు. లేదంటే బాలుడిని చంపేస్తామని ఆ లెటర్‌లో పేర్కొన్నారు. వాస్తవానికి ఈ లెటర్ అందడానికి ముందే ఈ హత్య జరిగినట్టు పోలీసులు చెబుతున్నారు. ఈ హత్యను ఓ కిడ్నాప్ కేసుగా మార్చాలనే ఉద్దేశంతోనే నిందితుడు ఆ బెదిరింపు లేఖ పంపినట్టు అనుమానిస్తున్నారు. ఈ ఘటన కాన్పూర్‌లో చోటుచేసుకుంది.

పోలీసులు అందించిన వివరాల ప్రకారం, పదో తరగతి పిల్లాడికి రచిత ట్యూషన్ చెబుతున్నది. రచిత బాయ్‌ఫ్రెండ్ ప్రభాత్ శుక్లా. ప్రభాత్ శుక్లానే రచిత ట్యూషన్ చెబుతున్న పదో తరగతి పిల్లాడిని హత్య చేశాడు. స్టోర్ రూమ్‌లోకి తీసుకెళ్లి చంపేశాడు.

Latest Videos

సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులు కీలక విషయాన్ని చెప్పారు. ఆ బాలుడు ప్రభాత్ వెంట స్వచ్ఛందంగా నడుస్తున్నట్టు కనిపించాడు. టీచర్ రచిత రమ్మన్నదని ఆ బాలుడికి ప్రభాత్ చెప్పినట్టు పోలీసులు పేర్కొన్నారు. దీంతో ఆ బాలుడు ప్రభాత్ వెంటే స్టోర్ రూమ్‌లోకి వెళ్లాడు. సుమారు 20 నిమిషాల తర్వాత ప్రభాత్ శుక్లా ఆ స్టోర్ రూమ్ నుంచి బయటికి వచ్చాడు. తన దుస్తులు మార్చుకున్నాడు. ఆ బాలుడిని స్కూటర్‌ తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ తర్వాత మరెవరూ స్టోర్ రూమ్‌లోకి వెళ్లలేదని పోలీసులు తెలిపారు.

Also Read: Fact Check: ఇందిరా గాంధీ హత్యను కీర్తించే హూడీ.. సింగర్ శుభ్‌నీత్ సింగ్ నిజంగానే ప్రమోట్ చేశాడా?

ఆ తర్వాత బాలుడి కుటుంబానికి పెద్ద మొత్తంలో డబ్బులు ఇవ్వాలని, వారి కుమారుడిని కిడ్నాప్ చేసినట్టు ఓ లెటర్ అందింది. కానీ, ఈ లెటర్ అందడానికి చాలా ముందే ఈ హత్య జరిగిందని పోలీసులు చెబుతున్నారు.

కేసు నమోదు చేస్తున్న పోలీసులు ప్రభాత్, 21 ఏళ్ల రచిత, వారి మిత్రుడు ఆర్యన్‌ను అరెస్టు చేశారు.

click me!