మణిపూర్ లోని భారత్-మయన్మార్ సరిహద్దు సమీపంలో అస్సాం రైఫిల్స్ సిబ్బంది వాహనంపై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. దుండగులను పట్టుకునేందుకు భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి.
మణిపూర్ లో గురువారం ఉదయం గస్తీ నిర్వహిస్తున్న అస్సాం రైఫిల్స్ సిబ్బంది వాహనంపై అనుమానిత ఉగ్రవాదులు దాడి చేశారు. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టమూ జరగలేదు. అలాగే సిబ్బంది ఎవరికీ గాయాలు కాలేదు. భారత్-మయన్మార్ సరిహద్దుకు సమీపంలోని తెంగ్నౌపాల్ జిల్లాలోని సైబోల్ వద్ద ఈ ఘటన జరిగింది.
పటాకులు ఇస్తానని నమ్మించి.. బాలుడిపై యువకుడి లైంగిక దాడి..
undefined
20వ అస్సాం రైఫిల్స్ బెటాలియన్ కు చెందిన సిబ్బంది సాధారణ గస్తీ కోసం తమ స్థావరం నుంచి బయటకు వెళ్లినప్పుడు వారిపై దాడి జరిగిందని రక్షణ వర్గాలు ‘ది న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్’తో తెలిపాయి. అనుమానిత ఉగ్రవాదులు మొదట ఐఈడీ (ఇంప్రూవైజ్డ్ ఎక్స్ ప్లోజివ్ డివైజ్) పేలుడుకు పాల్పడ్డారు. అనంతరం చిన్నపాటి ఆయుధాలతో కాల్పులు జరిపారు.
gudivada amarnath : గుజరాత్ తర్వాత ఏపీకే అత్యధిక పెట్టుబడులు - మంత్రి గుడివాడ అమర్ నాథ్
దీంతో వెంటనే అస్సాం రైఫిల్స్ సిబ్బంది ఎదురుదాడికి దిగారు. కొంత సమయం తరువాత రెండు వైపులా కాల్పులు ఆగిపోయాయి. కాగా.. నిందితులను పట్టుకునేందుకు భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఇటీవలి జాతి హింసతో ప్రభావితమైన జిల్లాలలో తాజా కాల్పులు జరిగిన తెంగ్నౌపాల్ ఒకటిగా ఉంది.
israel - hamas war :గాజా పార్లమెంట్ బిల్డింగ్ ను నేలమట్టం చేసిన ఇజ్రాయెల్ దళాలు.. వీడియో విడుదల..
‘‘ఉదయం 8.15 గంటల సమయంలో లోయకు చెందిన అనుమానిత తిరుగుబాటుదారులు తక్కువ తీవ్రత కలిగిన ఐఈడీని పేల్చి, చిన్న ఆయుధాలతో కాల్పులు జరిపారు. బలగాలు ఎదురుకాల్పులు జరిపాయని, కూంబింగ్ ఆపరేషన్ ప్రారంభించాం’’ అని రక్షణ శాఖ అధికారులు తెలిపారు.