Latest Videos

పటాకులు ఇస్తానని నమ్మించి.. బాలుడిపై యువకుడి లైంగిక దాడి..

By Asianet NewsFirst Published Nov 16, 2023, 2:48 PM IST
Highlights

పటాకులు ఇస్తానని నమ్మించి ఓ ఎనిమిదేళ్ల బాలుడిపై యువకుడు లైంగిక దాడికి ఒడిగట్టాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని ముంబాయి సిటీలో చేసుకుంది. తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.

ప్రస్తుతం మహిళలు, బాలికలకే కాదు.. కామాంధుల నుంచి బాలురకు కూడా రక్షణ లేకుండా పోయింది. స్కూళ్లలో, ఆడుకునే సమయంలో, బంధువుల ఇళ్లలో బాలురపై లైంగిక వేధింపులు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా మహారాష్ట్రలోని ముంబాయిలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. పోలీసులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..

దారుణం.. కన్న బిడ్డలకు విషమిచ్చి చంపిన కసాయి తండ్రి.. ముగ్గురు మృతి, మరొకరి పరిస్థితి విషమం..

ముంబాయి సిటీలోని ఆంటోప్ హిల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ కాలనీలో 8 ఏళ్ల బాలుడు తన తల్లిదండ్రులతో కలిసి జీవిస్తున్నాడు. దీపావళి పండగ కావడంతో ఆ బాలుడు తన ఇంటి ఎదుట పటాకులు కాలుస్తున్నాడు. అయితే ఆ ఇంటికి సమీపంలోనే నివసించే 32 ఏళ్ల వ్యక్తి ఆ సమయంలో బాలుడి దగ్గరికి వచ్చాడు. 

తన దగ్గర పెద్ద మొత్తంలో పటాకులు ఉన్నాయని, తనతో వస్తే వాటిని ఇస్తానని బాలుడికి మాయమాటలు చెప్పాడు. ఆ మాటలు నమ్మిన బాలుడి అతడి వెంట వెళ్లాడు. దగ్గరలో ఉన్న ఓ భవనంలోకి తీసుకెళ్లి బాలుడిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని బాలుడిని బెదిరించాడు.

israel - hamas war :గాజా పార్లమెంట్ బిల్డింగ్ ను నేలమట్టం చేసిన ఇజ్రాయెల్ దళాలు.. వీడియో విడుదల..

అతడి బెదిరింపుతో బాలుడు భయపడిపోయాడు. ఇంటికి వెళ్లినా ఎవరికీ ఈ విషయం చెప్పలేదు. అయితే బాలుడు ఏడుస్తుండగా తల్లిదండ్రులు గమనించారు. ఏం జరిగిందని ఆరా తీయగా తనపై జరిగిన లైంగిక దాడిని బాలుడు వివరించాడు. దీంతో తల్లిదండ్రులు వెంటనే పోలీసులను ఆశ్రయించారు.

gudivada amarnath : గుజరాత్ తర్వాత ఏపీకే అత్యధిక పెట్టుబడులు - మంత్రి గుడివాడ అమర్ నాథ్

దీంతో పోలీసులు నిందితుడిపై పోక్సో చట్టం కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మంగళవారం అతడిని అరెస్టు చేశారు. కాగా.. నిందితుడిలపై ఇప్పటికే రెండు వేధింపుల కేసులు నమోదయ్యాయని పోలీసులు తెలిపారు. తాజా కేసులో దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. 

click me!