
ముగ్గురు పిల్లలను చంపేసి ఓ తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన బీహార్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. అయితే భర్తతో గొడవ జరగడంతోనే ఆమె ఈ దారుణానికి ఒడిగట్టిందని వార్తా సంస్థ IANS నివేదించింది.
కైమూర్ జిల్లాలో భగవాన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పటేరియా గ్రామానికి చెందిన రింకీ దేవి (32) అజయ్ బింద్ భార్య భర్తలు. బల్వీర్ (8) ఆర్యన్ కుమార్ (3) అనే ఇద్దరు కుమారులు, హసీనా అలియాస్ రిచా కుమారి (4) అనే కుమార్తె ఉన్నారు. అయితే ఆ దంపతుల మధ్య రెండు రోజుల కిందట గొడవ జరిగింది. దీంతో మనస్థాపం చెందిన రింకీ దేవి ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయింది.
"కేవలం చట్టాలతో దళితుల జీవితాలు మారవు.. మనం ఆలోచనా ధోరణి కూడా మారాలి
ఆ తరువాత గ్రామ సమీపంలో ఉన్న ఓ బావి దగ్గరకు చేరుకుంది. ముందుగా ముగ్గురు పిల్లలను బావిలో తోసేసి తరువాత ఆమె కూడా అందులో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. నాలుగు మృతదేహాలు, మహిళ చెప్పులు బావిలో తేలుతూ ఉండటం గమనించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు.
వెంటనే వారు అక్కడికి చేరుకొని మృతదేహాలను బయటకు తీశారు. ఈ ఘటనపై భగవాన్‌పూర్ పోలీస్ స్టేషన్ అధికారి మాట్లాడుతూ.. ‘‘ మాకు ఈ ఘటనపై సమాచారం అందింన వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించాం. బావిలో ముగ్గురు పిల్లల మృతదేహాలు, ఓ మహిళ మృతదేహం తేలుతూ కనిపించాయి. మేము వాటిని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం కోసం పంపించాం’’ అని భగవాన్‌పూర్ పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు. మృతురాలి భర్తను అరెస్టు చేశామని, ఈ ఘటనకు కచ్చితమైన కారణం ఏంటనే విషయం తెలుసుకోవడానికి విచారణ జరుపుతున్నామని ఆయన పేర్కొన్నారు.
కారణమిదీ: హీరో ప్రభాస్ సహా ఆదిపురుష్ సినిమా యూనిట్ కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు
రెండు సంవత్సరాల కిందట తమిళనాడు రాష్ట్రంలో కూడా ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. కళ్లకురిచ్చి సమీపంలోని కీళ త్తూర్‌దిగుళి గ్రామానికి చెందిన ఈశ్వరన్ (30), రేవతి (27) దంపతులకు పుష్పలత (4), యమున (2) అనే ఇద్దరు కుమార్తెలున్నారు. ఆ సమయంలో భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చాయి. దీంతో కోపంతో ఈశ్వరన్ రేవతిపై చేయిచేసుకున్నాడు.
దీంతో మనస్తాపానికి గురైన రేవతి ఇద్దరు పిల్లలను తీసుకొని బయటకు వెళ్లిపోయింది. రాత్రి ఆమె ఇంటికి రాకపోవడంతో ఈశ్వరన్, బంధువుల సాయంతో చట్టుపక్కల ప్రాంతాల్లో గాలించినా ఫలితం లేకపోయింది. ఈ నేపథ్యంలో, ఆ ప్రాంతంలోని బావి సమీపంలో రేవతి చెప్పు కనిపించింది. దీంతో కారియలూరు పోలీసులు అక్కడకు చేరుకొని బావిలో గాలింపు చేపట్టడంతో రేవతి, పుష్పలత, యమున మృతదేహాలు బయటపడ్డాయి.
ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు. ఆత్మహత్యతో ఎవరూ ఏమీ సాధించలేరు. ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన వస్తే వెంటనే 9152987821 అనే ప్రభుత్వ హెల్ప్ లైన్ నెంబర్ కు కాల్ చేయండి. వారు మంచి కౌన్సిలింగ్ ఇచ్చి మీకు సహాయం చేస్తారు.