పశ్చిమ బెంగాల్ లో ఉద్రిక్తత.. స్టూడెంట్లు హిజాబ్ ధరించి స్కూల్ కు రావడంతో చెలరేగిన హింస..

By team teluguFirst Published Nov 23, 2022, 4:41 PM IST
Highlights

పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో హౌరా జిల్లాలో పలువురు విద్యార్థులు హిజాబ్ ధరించి పాఠశాలకు వచ్చారు. దీనికి నిరసనగా మరి కొందరు విద్యార్థులు కాషాయ కండువాలు ధరించి వచ్చారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు అక్కడికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. 

పశ్చిమ బెంగాల్ రాష్ట్రం హౌరా జిల్లా ఉద్రిక్తత నెలకొంది. ఓ పాఠశాలలో కొందరు విద్యార్థులు హిజాబ్ ధరించి పాఠశాలలోకి వచ్చారు. దీంతో పలువురు హిందూ విద్యార్థులు కాషాయ కండువాలు ధరించి పాఠశాలకు వచ్చారు. అయితే పాఠశాలలోకి వారిని అనుమించకపోవడంతో నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో హింస చెలరేగింది.

ఓయో హోటల్‌లో ప్రియురాలిని కాల్చి చంపి.. అంతటితో ఆగకుండా..

Latest Videos

ఈ ఘటన హౌరాలోని సంక్రైల్ లో పోలీస్ స్టేషన్ పరిధిలోని ధులాగఢ్‌కు చెందిన ఆదర్శ్ విద్యాలయలో జరిగింది. మంగళవారం 12వ తరగతి చదివే ముస్లిం బాలికలు హిజాబ్‌లు ధరించి పాఠశాలకు వచ్చారు. దీంతో హిందూ విద్యార్థులు కషాయ కండువాలు ధరించి, మతపరమైన నినాదాలు చేస్తూ పాఠశాలకు వచ్చారు. వాటిని తొలగించాలని పాఠశాల యాజమాన్యం, ఇతర వర్గాల విద్యార్థులు కోరారు. కానీ దానికి వారు నిరాకరించారు. దీంతో ఇరు వర్గాలకు చెందిన విద్యార్థులు పరస్పరం ఘర్షణకు దిగారు.

కేంద్ర మంత్రి మోహన్‌లాల్‌గంజ్ కౌశల్ కిషోర్ మేనల్లుడి ఆత్మహత్య..

పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో పోలీసులు ఆ ప్రాంతంలో భారీగా సిబ్బందిని మోహరించారు. పోలీసులు, రాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ఆర్ఏఎఫ్) సిబ్బంది ఉద్రిక్తతలను తగ్గించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సుకాంత మజుందార్ ‘టైమ్స్ నౌ’తో మాట్లాడారు. పాఠశాలల మర్యాదను కాపాడుకోవాలని అన్నారు. హౌరాలో కూడా ఇలాంటి సంఘటనే జరిగిందని, గత కొన్ని నెలలుగా హిజాబ్ ధరించి పాఠశాలకు వస్తున్నారని తెలిపారు. హిందూ బాలురందరూ దానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారని చెప్పారు. హిజాబ్ కు నిరసనగా, వారు కూడా మతపరమైన దుస్తుల్లో వచ్చారని అన్నారు. దీంతో పాఠశాల యంత్రాంగం అభ్యంతరం వ్యక్తం చేసిందని అన్నారు. ప్రతి పాఠశాలకూ వారి హుందాతనం ఉంటుందని, దానిని కొనసాగించాలని తెలిపారు.
 

click me!