కేంద్ర మంత్రి మోహన్‌లాల్‌గంజ్ కౌశల్ కిషోర్ మేనల్లుడి ఆత్మహత్య..

By team teluguFirst Published Nov 23, 2022, 3:56 PM IST
Highlights

కేంద్ర మంత్రి కౌశల్ కిషోర్ మేనల్లుడు నంద్ కిషోర్ ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఆయన ఆత్మహత్యకు కారణాలంటనే విషయం ఇంకా తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్ర సహాయ మంత్రి మోహన్‌లాల్‌గంజ్ కౌశల్ కిషోర్ మేనల్లుడు నంద్ కిషోర్ (45) ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రాపర్టీ డీలర్‌గా పనిచేస్తున్న నంద్ కిషోర్ లక్నోలోని దుబగ్గలోని బిగారియా ప్రాంతంలోని తన ఇంట్లో బుధవారం ఉదయం ఇంట్లో ఉరి వేసుకొని కనిపించాడు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు.

నకిలీ సర్టిఫికెట్ల రాకెట్‌ గుట్టు రట్టు.. ముగ్గురి అరెస్ట్‌

దుబగ్గ ఇన్‌స్పెక్టర్ తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం ఉదయం నంద్‌ కిషోర్‌ తన గదిలో ఉరివేసుకుని ఉండటాన్ని చూసి సోదరుడు గట్టిగా అరిచాడు. అనంతరం హడావుడిగా ఉరి నుంచి బయటకు తీసి హాస్పిటల్ కు తీసుకెళ్లాడు. కానీ అక్కడికి తీసుకెళ్లిన వెంటనే నందకిషోర్ మరణించినట్టు డాక్టర్లు ప్రకటించారు. ఆత్మహత్యకు గల కారణాలంటనే విషయంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.

నేను చేసిన పనికి నాకు శిక్ష పడుతుంది...తాంత్రికుడు!

నంద్ కిషోర్ రెండు పెళ్లిళ్లు చేసుకున్నారు. భార్యల్లో ఒకరు ముస్లిం కాగా.. మరొకరు హిందువు. ఆయన మొదటి భార్య షకీలా ద్వారా ఆయనకు అఫ్జల్, సాహిల్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. రెండో భార్య ద్వారా కుమారులు విశాల్, ఆదర్శ్, కుమార్తెలు అన్షిక, శిఖ ఉన్నారు. అయితే తన తండ్రి కొన్ని రోజులుగా పలు ఇబ్బందులు పడుతున్నాడని కుమారుడు విశాల్ తెలిపారు. 

ఆఫ్తాబ్ పూనావాలా నన్ను నరికేస్తానని బెదిరిస్తున్నాడు.. 2020లో పోలీసులకు శ్రద్ధా వాకర్ లేఖ.. తాజాగా వెలుగులోకి

కాగా.. మృతుడి సోదరుడు కౌశల్ కిషోర్ ఉత్తరప్రదేశ్ లోని మోహన్‌లాల్‌గంజ్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రస్తుతం ఆయన గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రిగా పనిచేస్తున్నారు. ఇటీవల శ్రద్ధా వాకర్ హత్య కేసుకు సంబంధించి పలు వ్యాఖ్యలు చేస్తూ ఆయన వార్తల్లో నిలిచారు. చదువుకున్న అమ్మాయిలు లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లోకి రాకూడదని ఆయన సూచించారు. 

click me!