ఓయో హోటల్‌లో ప్రియురాలిని కాల్చి చంపి.. అంతటితో ఆగకుండా.. 

Published : Nov 23, 2022, 04:06 PM IST
ఓయో హోటల్‌లో ప్రియురాలిని కాల్చి చంపి.. అంతటితో ఆగకుండా.. 

సారాంశం

ఢిల్లీ లోని నరేలా ప్రాంతంలోని ఓయో హోటల్‌లో ఓ యువకుడు తన ప్రియురాలిని కాల్చి చంపాడు. అనంతరం తనను తాను కాల్చుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. పోలీసులు ప్రవీణ్ అలియాస్ సిటును చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. హత్య కేసులో బెయిల్‌పై విడుదలైన ప్రవీణ్ ఇటీవలే బయటకు వచ్చినట్లు సమాచారం.

ఢిల్లీ ఓయో హోటల్: దేశ రాజధాని ఢిల్లీలో ఓ దారుణం జరిగింది. ఓయో హోటల్‌ కు ప్రియురాలిని తీసుకెళ్లి..అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన సంచలనం రేపుతోంది.సమాచారం ప్రకారం.. నిందితుడు మొదట బాలిక తలపై కాల్చారు. అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం తనను తాను కాల్చుకుని తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని సంజయ్ గాంధీ ఆస్పత్రిలో చేర్చారు. ఈ విషయమై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు. ఈ ఘటన ఢిల్లీ లోని నరేలా ప్రాంతంలోని ఓయో హోటల్‌లో  చోటు చేసుకుంది.

వివరాల్లోకెళ్తే.. ప్రవీణ్ అలియాస్ సితు (38) ఢిల్లీలోని నరేలా ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. అతనికి గీత అనే (39) ఏళ్ల మహిళతో స్నేహం ఏర్పడింది. మంగళవారం వారిద్దరూ నరేలాలోని ఓయో హోటల్‌కి వెళ్లారు. ఏదో విషయమై గదిలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ తరుణంలో ప్రవీణ్ తన ప్రియురాలి తలపై  తుపాకీతో కాల్చి చంపాడు. అనంతరం తనను తాను కాల్చుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. హోటల్‌లో కాల్పుల కలకలం చెలారేగడంతో ఆ హోటల్ యాజమాన్యం వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వారిద్దరినీ ఆసుపత్రికి తరలించగా, గీత మృతి చెందినట్లు నిర్ధారించారు. కాగా ప్రవీణ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. అందిన సమాచారం మేరకు ప్రవీణ్‌కు కూడా వివాహమైంది. అతని భార్య సుశీల పిల్లలతో కలిసి జీవిస్తున్నాడు. 

అంతే కాదు.. ప్రవీణ్ ఈ ఏడాది సెప్టెంబర్ 21న గౌరవ్ అనే యువకుడిని కాల్చి చంపినట్లు పోలీసులు విచారణలో తేలింది. మృతుడి తండ్రి ప్రవీణ్ అలియాస్ సితుపై కూడా 
ఆరోపణలున్నాయి. ఆ తర్వాత పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అతను నవంబర్ 18న మధ్యంతర బెయిల్‌పై బయటకు వచ్చాడు. అయితే ప్రస్తుతం పోలీసులు పలు కోణాల్లో విచారణ జరుపుతున్నారు.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Top 5 Biggest Railway Stations : ఏ ముంబై, డిల్లీలోనో కాదు.. దేశంలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?
యువతకు బంపరాఫర్ ... 2026లో లక్షన్నర ప్రభుత్వ కొలువులు