
నాగాలాండ్‌లో ఉద్రిక్తత నెలకొంది. చుమౌకెడిమా, పెరెన్ జిల్లాల మధ్య ఉన్న వివాదాస్పద ప్రాంతంపై రెండు వర్గాలు ఘర్షణ పడ్డాయి. ఈ ఘటనలో 15 మంది గాయాలు అయ్యాయి. వారిలో తొమ్మిది మందికి పెల్లెట్ గాయాలయ్యాయి. ఈ క్షతగాత్రులు దిమాపూర్‌లోని ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయాన్ని అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఏడీజీపీ) సందీప్ ఎం తమగాడ్గే వార్తా సంస్థ ‘పీటీఐ’కి తెలిపారు.
జమ్మూ కాశ్మీర్ లో ఘోర ప్రమాదం.. అదుపుతప్పి చీనాబ్ నదిలో పడిపోయిన కారు.. నలుగురు మృతి
పెల్లెట్‌తో గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని ఆయన తెలిపారు. ఈ హింసలో 8-10 పది కచ్చా ఇళ్లు కూడా కాలిపోయాయని పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో శాంతి భద్రతల పరిరక్షణకు తగిన బలగాలను రంగంలోకి దింపినట్టు చెప్పారు. ఈ ఘటనపై రెండు అత్యున్నత స్థాయి ప్రత్యేక దర్యాప్తు బృందాలు (సిట్‌లు) విచారణ జరుపుతాయని ఆయన చెప్పారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని తమ్‌గాడ్గే చెప్పారు.
నేడు సుప్రీంకోర్టు సీజేఐగా ప్రమాణ స్వీకారం చేయనున్న జస్టిస్ డీవై చంద్రచూడ్.. ఏమిటీ ఆయన నేపథ్యం.. ?
కాగా.. హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న నమ్‌హైలమ్డి గ్రామాన్ని హోం మినిస్టర్, ఉప ముఖ్యమంత్రి వై పాటన్, సీనియర్ పోలీసు అధికారులతో కలిసి పగటిపూట సందర్శించారు. ఈ పర్యటన సందర్భంగా శాంతిని కాపాడాలని, పరిస్థితిని మరింత తీవ్రతరం చేసే చర్యలకు దూరంగా ఉండాలని ఆయన ప్రజలను కోరారని ఐఅండ్ పీఆర్ డిపార్ట్ మెంట్ విడుదల చేసిన ఒక ప్రకటన పేర్కొంది.
రెండు జిల్లాల సరిహద్దులో ఇరు వర్గాల ప్రజలు శాంతియుతంగా ఉండాలని అన్నారు.కాగా.. ఈ ప్రాంతంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఇరు వర్గాలతో చర్చించి, వారి సమస్యలను పరిష్కరించాలని సెంట్రల్ నాగాలాండ్ ట్రైబ్స్ కౌన్సిల్, టెనిమియా పీపుల్స్ ఆర్గనైజేషన్ నాయకులను కోరారు.