
జమ్మూకశ్మీర్‌లోని దోడా జిల్లాలో మంగళవారం ఘోర ప్రమాదం జరిగింది. ఓ కారు అదుపుతప్పి చీనాబ్ నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో దాదాపు నలుగురు చనిపోయారు. మంగళవారం రాత్రి 7.30 గంటల ప్రాంతంలో బటోట్-కిష్త్వార్ జాతీయ రహదారిపై షిబ్నోట్-కరారా వద్ద ఈ ప్రమాదం జరిగిందని ఎస్‌డీఎం (తాతిరి) అథర్ అమీన్ జర్గర్ తెలిపారు. కారు దోడా నుంచి కిష్త్వార్‌కు వెళ్తుండగా అకస్మాత్తుగా ప్రవహిస్తున్న నదిలో పడిపోయిందని తెలిపారని ‘టైమ్స్ నౌ’ నివేదించింది.
నేడు సుప్రీంకోర్టు సీజేఐగా ప్రమాణ స్వీకారం చేయనున్న జస్టిస్ డీవై చంద్రచూడ్.. ఏమిటీ ఆయన నేపథ్యం.. ?
షిబ్నోట్‌లోని ప్రమాద స్థలానికి సమీపంలో ఉన్న స్థానిక వాలంటీర్లు, జమ్మూ కాశ్మీర్ అడ్వెంచర్స్ టీమ్స్ తో పాటు పోలీసు బృందం రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించింది. అయితే ఆ కారు, అందులో ఉనన నలుగురు వ్యక్తుల ఆచూకీ లభించలేదు. కాగా ఈ ప్రమాదంపై కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ స్పందించారు. ప్రమాద బాధితుల జాడ కోసం అన్ని విధాలా కృషి చేస్తున్నామని చెప్పారు. అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని పేర్కొన్నారు.
‘‘ ఇప్పుబే దొడ డీసీ విశేష్ పాల్ మహాజన్‌తో మాట్లాడాను. నలుగురు వ్యక్తులతో వెళ్తున్న ఒక ప్రైవేట్ కారు ప్రమాదవశాత్తూ థాత్రి, ప్రేమ్ నగర్ మధ్య షిబ్నోట్ వద్ద చీనాబ్ నదిలో లోతుగా పడిపోయింది. బాధితులను కనుగొనడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. నేను నిరంతరం టచ్ లో ఉన్నాను. ’’ అని జితేంద్ర సింగ్ ట్వీట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఇదిలా ఉండగా.. మంగళవారం తెల్లవారుజామున ఉత్తర కాశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో కూడా ప్రమాదం జరిగింది. హంద్వారాలోని వాటిన్ ప్రాంతంలో ప్రయాణికులతో వెళ్తున్న వాహనం ప్రమాదానికి గురయ్యింది. ఈ ఘటనలో దాదాపు 20 మంది గాయపడ్డారు. అలాగే ఆదివారం నాగిన్ సమీపంలో జరిగిన కారు ప్రమాదంలో ఆరుగురు గాయపడ్డారు. గుల్‌మార్గ్-బూటపత్రి రహదారిపై మంచు కురుస్తోంది. దీంతో శనివారం రాత్రి నుంచి ఇక్కడ రాష్ డ్రైవింగ్ చేయకూడదని అధికారులుసూచనలు చేశారు. అయిప్పటికీ వాటిని పట్టించుకోకుండా అతి వేగంగా కారును నడపడంతో ఈ ప్రమాదం జరిగింది. అయితే ఆర్మీ సిబ్బంది క్షతగాత్రులను రక్షించి హాస్పిటల్ కు తరలించారు.