జిమ్ ట్రైనర్ కిడ్నాప్, హత్య... హర్యానాలో ఉద్రిక్తత... !

By AN TeluguFirst Published May 18, 2021, 10:17 AM IST
Highlights

హర్యానాలోని చంఢీగఢ్, నుహ్ జిల్లాలో ఆదివారం నుంచి ఉద్రిక్తత నెలకొంది, 27 ఏళ్ల జిమ్ ట్రైనర్ కిడ్నాప్, హత్య విషయంలో నిరసనలు చెలరేగాయి. కిడ్నాప్ అయిన కొన్ని గంటల తరువాత అతను విగతజీవిగా దొరకడంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. గ్రామంలోని ఓ వర్గం ఈ పనికి తెగబడడంతో కోపోద్రిక్తులైన మరో వర్గాన్ని చెదరగొట్టడానికి పోలీసులు గాలిలో కాల్పులు జరిపారు. 

హర్యానాలోని చంఢీగఢ్, నుహ్ జిల్లాలో ఆదివారం నుంచి ఉద్రిక్తత నెలకొంది, 27 ఏళ్ల జిమ్ ట్రైనర్ కిడ్నాప్, హత్య విషయంలో నిరసనలు చెలరేగాయి. కిడ్నాప్ అయిన కొన్ని గంటల తరువాత అతను విగతజీవిగా దొరకడంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. గ్రామంలోని ఓ వర్గం ఈ పనికి తెగబడడంతో కోపోద్రిక్తులైన మరో వర్గాన్ని చెదరగొట్టడానికి పోలీసులు గాలిలో కాల్పులు జరిపారు. 

జిమ్ ట్రైనర్ అంత్యక్రియలు సోమవారం జరిగాయి. వీటికి హాజరైన వారిలో  చాలామంది పోలీసులపై రాళ్ళు రువ్వారు. నుహ్‌లోని ఖేదా ఖలీల్‌పూర్‌లో నివసిస్తున్న ఆసిఫ్ హుస్సేన్ నిన్న తన ఇద్దరు బంధువులతో కలిసి మందులు కొనడానికి వెళ్లిన సమయంలో కిడ్నాప్ అయ్యాడు. ముందు వీరిని డజను మంది ముట్టడించారు. తరువాత తీవ్రంగా కొట్టారు. వారి బంధువులను వదిలేసి.. అతన్ని అక్కడ్నుంచి తీసుకువెళ్లారు. 

హుస్సేన్ మీద దాడి చేసిన వారే అతన్ని హత్య చేశారని, అతని మీద తమ ఆయుధాలు ఉపయోగించారని ఫిర్యాదుదారులు ఆరోపించారు. ఫిర్యాదు అందిన తరువాతే అతని మృతదేహం దొరికింది.

అయితే ఈ హత్యలో "హిందూ-ముస్లిం కోణం" లేదని నుహ్ పోలీస్ సూపరింటెండెంట్ నరేంద్ర సింగ్ తెలిపారు. అయితే ఈ రెండు గ్రూపుల మధ్య తరచుగా ఘర్షణలు చెలరేగుతున్నాయని.. గ్రామంలోని పెద్దలు వీరికి సర్ధిచెప్పేవారని పోలీసులు తెలిపారు. 

ఈ ఘటనలో కీలక నిందితుడైన హుస్సేన్ గ్రామానికే చెందిన ఖేదా ఖలీల్పూర్ తో పాటు మరికొందరిని అరెస్టు చేశారు. కాగా, మిగిలిన వారు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు.

‘రెండు గ్రూపుల వద్ద అక్రమంగా ఆయుధాలు ఉన్న కారణంగా ఆయుధ చట్టం  సెక్షన్ల క్రింద, దాడి అంశం మీద  కేసులు పెట్టాం. ఆరుగురు నిందితులను అరెస్టు చేశాం.. కేసు దర్యాప్తు కోసం ఒక సిట్ ఏర్పాటు చేయబడింది" అని సింగ్ చెప్పారు.

హుస్సేన్ మృతదేహానికి సోమవారం పోస్టుమార్టం నిర్వహించారు. అంత్యక్రియల సందర్భంగా పోలీసులపై రాళ్లు రువ్విన 10 మందిని పోలీసులు అరెస్టు చేశారు.

స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే అఫ్తాబ్ అహ్మద్ హుస్సేన్ కు న్యాయం చేయాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. అతన్ని హత్య చేసిన నిందితులు క్రూర స్వభావులని అన్నారు. 

హత్యకు నిరసనగా నిన్న అర్థరాత్రి కుండలి - మనేసర్ - పాల్వాల్ ఎక్స్‌ప్రెస్‌వేను నిరసనకారులు బ్లాక్ చేశారు. కోపంతో ఉన్న నిరసనకారులపై పోలీసులు లాఠీఛార్జ్ చేయాల్సి వచ్చింది. మరో చోట నిరసన చేస్తున్న వారిని గాలిలో కాల్పులు జరిపి  చెదరగొట్టారు. నిరసనకారుల దాడిలో వాహనాల కారు అద్దారు ధ్వంసమయ్యాయి. 

బాధితుడి కుటుంబానికి అండగా పోలీసులు ఉన్నారని.. నిరసనకారులు ఓపికతో ఉండాలని ఎస్పీ సింగ్ విజ్ఞప్తి చేశారు. కేసును త్వరితంగా పరిష్కరించడానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు.

click me!