టౌటే ఎఫెక్ట్: 14 మంది మృతి,ఆరు రాష్ట్రాల్లో జోరు వానలు

By narsimha lodeFirst Published May 18, 2021, 9:26 AM IST
Highlights

టౌటే తుఫాన్  ప్రభావంతో దేశంలో ఆరు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలు, పెనుగాలుల ధాటికి ఆయా రాష్ట్రాల్లో 14 మంది మరణించారు. 

న్యూఢిల్లీ: టౌటే తుఫాన్  ప్రభావంతో దేశంలో ఆరు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలు, పెనుగాలుల ధాటికి ఆయా రాష్ట్రాల్లో 14 మంది మరణించారు. సోమవారం  రాత్రి పొద్దుపోయిన తర్వాత  గుజారత్ తీరాన్ని తుఫాన్ తాకింది. ముంబై తీర ప్రాంతంలోని అరేబియా సముద్రంలో రెండు నౌకలు తుపాన్ కారణంగా లంగర్లు కొట్టుకొని సముద్రంలో కొట్టుకుపోయాయి. ఈ రెండు నౌకల్లోని 400 మంది సిబ్బందిని నేవీ అధికారుల రక్షించారు.  తుఫాన్ కారణంగా ముంబై అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కొన్ని గంటల పాటు మూసివేశారు. 

also read:టౌటే ఎఫెక్ట్: ముంబై తీరంలో కొట్టుకుపోయిన రెండు నౌకలు, 410 మంది సిబ్బంది

తుఫాన్ ప్రభావంతో మహారాష్ట్రలోని కొంకణ్ ప్రాంతంలో ఆరుగురు మరణించారు. రెండు పడవలు మునిగిన ఘటనలో ముగ్గురు నావికులు గల్లంతయ్యారు. కర్ణాటక రాష్ట్రంలో ఎనిమిది మంది చనిపోయారు.  కేరళ రాష్ట్రంలోని 9 జిల్లాల్లో తుపాన్ ప్రభావం కన్పించింది. సోమవారం నుండి గుజరాత్ రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో జోరు వానలు పడుతున్నాయి.వర్షాలు, పెనుగాలులతో సెల్‌టవర్లు, విద్యుత్ స్థంబాలు, చెట్లు విరిగాయి. పలు చోట్ల వాహనాల రాకపోకలు స్థంభించాయి. 


 

click me!