కరోనాతో ఐఎంఏ మాజీ అధ్యక్షుడు అగర్వాల్ మృతి

By narsimha lodeFirst Published May 18, 2021, 9:52 AM IST
Highlights

పద్మశ్రీ అవార్డు గ్రహీత ఐఎంఏ మాజీ అధ్యక్షుడు కెకె అగర్వాల్ సోమవారం నాడు అర్ధరాత్రి కరోనాతో మరణించాడు. 

న్యూఢిల్లీ: పద్మశ్రీ అవార్డు గ్రహీత ఐఎంఏ మాజీ అధ్యక్షుడు కెకె అగర్వాల్ సోమవారం నాడు అర్ధరాత్రి కరోనాతో మరణించాడు. కరోనా సోకిన అగర్వాల్ ఎయిమ్స్ ఆసుపత్రిో చికిత్స పొందుతున్నాడు. కరోనా సోకిన అగర్వాల్ ఎయిమ్స్ ఆసుపత్రిలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నారు. వైద్యుడిగా ప్రజలకు చికిత్స చేయడంతో పాటు వైద్య విషయంలో ప్రజలను చైతన్యవంతం చేయడంలో అగర్వాల్ కీలకంగా వ్యవహరించారు. వైద్య రంగంలో విశేష కృషి చేసిన అగర్వాల్ కు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డును ప్రకటించింది. 

కరోనా సెకండ్ వేవ్ సమయంలో కూడ ప్రజలకు ఆరోగ్యం విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వీడియోలు రికార్డు చేసి ఆయన ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రయత్నం చేశారు. అగర్వాల్ గుండె వైద్య నిపుణులుగా సుదీర్ఘకాలం పనిచేశారు. ఆయన హర్ట్‌కేర్ పౌండేషన్ కు ఆయన అధ్యక్షుడిగా పనిచేశారు.  వైద్య విభాగంలో విశేష కృషి చేసిన అగర్వాల్ కు 2010లో కేంద్రం పద్మశ్రీ అవార్డును ఇచ్చి ఆయనను సత్కరించింది. 1979లో నాగ్‌పూర్ యూనివర్శిటీ నుండి ఆయన ఎంబీబీఎస్ పట్టా పొందారు. 1983లో ఎండీ పట్టా  అదే యూనివర్శిటీ నుండి పొందారు.  2017 వరకు ఢిల్లీలోని మూల్‌చంద్ మెడిసీటీ ఆసుపత్రిలో సీనియర్ కన్సల్టెంట్ గా 2017 వరకు పనిచేశారు. 


 

click me!