ఆలయంలో మహిళలపై అత్యాచారం, పూజారి అరెస్ట్

Published : May 20, 2020, 02:12 PM IST
ఆలయంలో మహిళలపై అత్యాచారం, పూజారి అరెస్ట్

సారాంశం

అమృత్‌సర్ లోపోక్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని రామ్ తీర్థ్ కాంప్లెక్స్‌లో ఉన్న గురు జ్ఞాన్‌నాథ్ ఆశ్రమ వాల్మీకి తీర్థ్‌కు చెందిన ప్రధాన పూజారి తమను నిర్బంధించి అనేకసార్లు అత్యాచారానికి పాల్పడినట్లు ఇద్దరు మహిళలు ఆ రాష్ట్ర ఎస్టీ, ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.  

ఆలయంలో స్వామివారి దర్శనానికి వచ్చిన ఇద్దరు మహిళలపై ఓ పూజారి అఘాయిత్యానికి పాల్పడ్డాడు.ఈ దారుణ సంఘటన పంజాబ్‌‌ రాజధాని అమృత్‌సర్ లో చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

పూర్తి వివరాల్లోకి వెళితే... అమృత్‌సర్ లోపోక్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని రామ్ తీర్థ్ కాంప్లెక్స్‌లో ఉన్న గురు జ్ఞాన్‌నాథ్ ఆశ్రమ వాల్మీకి తీర్థ్‌కు చెందిన ప్రధాన పూజారి తమను నిర్బంధించి అనేకసార్లు అత్యాచారానికి పాల్పడినట్లు ఇద్దరు మహిళలు ఆ రాష్ట్ర ఎస్టీ, ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.

దీంతో కమిషన్ డీజీపీకి లేఖ రాయగా.. ఆయన ఆదేశాలతో పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు ఆలయానికి వెళ్లి ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రధాన పూజారితో పాటు మరొక వ్యక్తిని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టి నిజానిజాలు వెలికితీస్తామని పోలీసులు చెబుతున్నారు.

PREV
click me!

Recommended Stories

Coldest Places in India : మైనస్ 50°C ఉష్ణోగ్రతలా..! అత్యంత చలిగావుండే టాప్ 5 ప్రదేశాలివే
Gen z పోస్టాఫీస్‌లు వ‌చ్చేస్తున్నాయ్‌.. వీటి ప్ర‌త్యేక‌త ఏంటి.? వీటిలో ఏముంటాయ్‌..