భారత్ లో మళ్లీ టిక్ టాక్ బ్యాన్..? పడిపోతున్న రేటింగ్

By telugu news teamFirst Published May 20, 2020, 1:42 PM IST
Highlights

ఈ యాప్ మోజులో పడి చాలా మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని ఆ మధ్య దీనిని దేశంలో బ్యాన్ చేశారు. తర్వాత మళ్లీ తీసుకువచ్చారు.  అయితే.. మరోసారి భారత్ లో ఈ యాప్ ని బ్యాన్ చేసే అవకాశం కనిపిస్తోంది. దీనిని బ్యాన్ చేయాలంటూ ప్రత్యేకంగా ఓ క్యాంపైన్ కూడా చేస్తుండటం గమనార్హం.

టిక్ టాక్ ఈ యాప్ గురించి ప్రస్తుత రోజుల్లో తెలియని వాళ్లు అంటూ ఎవరూ ఉండరు అనడంలో అతిశయోక్తి లేదు. సినిమాల్లో పాటలు, డైలాగ్ లకు లింప్ సింక్ ఇస్తూ, డ్యాన్సులు వేస్తూ యూత్ ఈ యాప్ ని విపరీతంగా వాడేస్తున్నారు. ఈ యాప్ ద్వారా సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకొని సెలబ్రెటీ హోదా తెచ్చుకున్న వాళ్లు చాలా మందే ఉన్నారు.

అయితే.. ఈ యాప్ మోజులో పడి చాలా మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని ఆ మధ్య దీనిని దేశంలో బ్యాన్ చేశారు. తర్వాత మళ్లీ తీసుకువచ్చారు.  అయితే.. మరోసారి భారత్ లో ఈ యాప్ ని బ్యాన్ చేసే అవకాశం కనిపిస్తోంది. దీనిని బ్యాన్ చేయాలంటూ ప్రత్యేకంగా ఓ క్యాంపైన్ కూడా చేస్తుండటం గమనార్హం.

అసలు అంతలా దీనిపై వ్యతిరేకత ఎందుకు వచ్చిందా అని ఆరా తీస్తే అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఫైజల్ సిద్దిఖీ అనే టిక్ టాకర్ యాసిడ్ అటాక్ ను ప్రతిబింబించేలా చేసిన వీడియో వివాదానికి కారణమైంది. దీనికి తోడు చైనా యాప్ అనే పేరు కూడా టిక్‌టాక్ ను బ్యాన్ చేయాలనే డిమాండ్ కు కారణమైంది.

ప్రస్తుతం దేశాన్ని కరోనా వైరస్ పట్టిపీడిస్తోంది.అది చైనా నుంచి వచ్చిందనే విషయం మనకు తెలిసిందే. దీంతో.. కరోనా వైరస్ కోపం చైనా యాప్ అయిన టిక్ టాక్ పైన పడింది. దీంతో.. దీనిని వాడొద్దంటూ కొందరు ప్రచారం మొదలుపెట్టారు. కాగా.. ప్లేస్టోర్ లో దీని రేటింగ్ కూడా దారుణంగా పడిపోవడం గమనార్హం. గతంలో 4.5 రేటింగ్ ఉన్న ఈ యాప్ 3, 2కి కూడా పడిపోయింది. కావాలనే దాని రేటింగ్ తగ్గిస్తున్నారు.

2019 ఏప్రిల్‌లో మద్రాస్ హైకోర్టు తీర్పుతో ఈ యాప్‌ని కేంద్రం నిషేధించింది. ఐతే… ఇకపై తగిన చర్యలు తీసుకుంటామని యాజమాన్యం చెప్పడంతో… కొన్ని రోజులకే కేంద్రం ఆ నిషేధాన్ని ఎత్తివేసింది. ఏడాది గడిచింది. అయినా పరిస్థితి మారలేదు. ఇప్పుడు మరింత ఎక్కువగా హింసాత్మక, వివక్షాపూరిత వీడియోలు ఈ యాప్‌లో కనిపిస్తున్నాయి. ఈ యాప్‌‌ని ఇలాగే వదిలేస్తే… ఇది దేశానికే ప్రమాదకరం అంటున్నారు చాలా మంది.

click me!