కరోనా కాలర్ ట్యూన్ ఎవరిదో తెలుసా..?

By telugu news teamFirst Published May 20, 2020, 12:39 PM IST
Highlights

దక్షిణ కన్నడ జిల్లాకి చెందిన ఇద్దరు ఓయిస్ ఓవర్ ఆర్టిస్టులతో ఈ కాలర్ ట్యూన్లను రికార్డు చేశారు. దేశంలో కరోనా కలకలం మొదలైన మార్చి మొదటి వారంలో కాలర్ ట్యూన్లలో మొదట దగ్గు వినిపించి తర్వాత ఓ స్వరం వినిపించేది కదా అది దక్షిణ కన్నడ జిల్లాకి చెందిన జెస్సీకా ఫెర్నాండెజ్ తన వాయిస్ గా పెర్కొన్నారు.

కరోనా వైరస్ కేసులు మన దేశంలో నమోదు కాకముందే ఫోన్ లో దానికి సంబంధించి ఓ అలర్ట్ వచ్చేది. ఎవరికి ఫోన్ చేద్దామన్నా ముందు ఆ కరోనా జాగ్రత్తలు వినాల్సి వచ్చేది. దగ్గుతో మొదలై.. జాగ్రత్తలతో ముగిచేసేది. ఇప్పటికీ ఆ వాయిస్ వస్తుందనుకోండి.. అయితే..  ఆ వాయిస్ ఎవరిదో ఎప్పుడైనా ఆలోచించారా.. ఇటీవలే తాజాగా ఆ వాయిస్ ఎవరిదో బయటపడింది.

దక్షిణ కన్నడ జిల్లాకి చెందిన ఇద్దరు ఓయిస్ ఓవర్ ఆర్టిస్టులతో ఈ కాలర్ ట్యూన్లను రికార్డు చేశారు. దేశంలో కరోనా కలకలం మొదలైన మార్చి మొదటి వారంలో కాలర్ ట్యూన్లలో మొదట దగ్గు వినిపించి తర్వాత ఓ స్వరం వినిపించేది కదా అది దక్షిణ కన్నడ జిల్లాకి చెందిన జెస్సీకా ఫెర్నాండెజ్ తన వాయిస్ గా పెర్కొన్నారు.

ఢిల్లీ స్టూడియో నుంచి తనకు ఫోన్‌ వచ్చినప్పుడు.. త్వరలోనే తన స్వరం కాలర్‌ ట్యూన్‌గా వినిపించబోతుందన్న సంగతి అంతగా తెలియదన్నారు. కొద్ది రోజుల తర్వాత మా అమ్మ ఫోన్ చేసి నా స్వరం మొబైల్ ఫోన్ కాలర్ ట్యూన్‌గా వినిపిస్తున్నట్టు చెప్పారు. దీంతో వెంటనే ఢిల్లీ స్టూడియోకి ఫోన్ చేసి నా పేరు వెల్లడించవద్దని కోరాను. 

పదే పదే నా స్వరం వింటే వినియోగదారులకు విసుగెత్తి ట్రోల్ చేస్తారని ఇన్నాళ్లూ దాచిపెట్టానని ఆమె చెప్పారు. ఎవరో సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్టు చేయడంతో తన పేరు బయటికి వచ్చిందని చెప్పారు. అయితే ఇప్పుడు ట్రోలింగ్స్‌తో పాటు నాకు ప్రశంసలు కూడా అంతే స్థాయిలో అందుతున్నాయని ఆమె సంబరపడుతున్నారు. దగ్గుతో మొదలయ్యే కాలర్ ట్యూన్ జెస్సీకా స్వరం కాగా.. మిగతా రెండు ట్యూన్లకు విద్య నారాయణ్ భట్ డబ్బింగ్ చెప్పారు.

click me!