చదువుకోమని ఫోన్ ఇస్తే సోషల్ మీడియాలో న్యూడ్ ఫొటోలు.. బాలిక తల్లిదండ్రులకు హార్ట్ ఎటాక్

By telugu teamFirst Published Aug 29, 2021, 7:31 PM IST
Highlights

టీనేజీ బాలిక.. స్మార్ట్ ఫోన్ ఇవ్వడంతో తెలియని ఫ్రీడమ్ చేతికి అందివచ్చినట్టయింది. మంచిగా చదువుకోవాలని ప్రత్యేక గదినీ కేటాయించడంతో ఆమెను పర్యవేక్షించే కళ్లు లేకుండా పోయాయి. దీంతో ఆమెకు తెలిసీ తెలియక సోషల్ మీడియాలో నగ్న ఫొటోలు పోస్టు చేసింది. ఈ విషయాన్ని బంధువులు తల్లిదండ్రులకు తెలియజేయగానే వారికి గుండె పోటే వచ్చింది. తర్వాత కౌన్సెలింగ్ ఇప్పించాక బాలిక తన సోషల్ మీడియా ఖాతాలు డిలీట్ చేసి బుద్ధిగా చదువుకుంటానని ప్రామిస్ చేసింది.

అహ్మదాబాద్: గుజరాత్‌లో బాధాకర ఘటన వెలుగులోకి వచ్చింది. టీనేజ్ బాలికకు చదువుకోవాలని ఫోన్ కొనిచ్చి, ప్రత్యేక గదిని కేటాయిస్తే ఆమె ఆ ఫోన్‌తో సోషల్ మీడియాలో అసభ్యకర ఫొటోలు పోస్టు చేయడం మొదలుపెట్టింది. అంతేకాదు, బంధువుల పిల్లలనూ అదే ఫాలో కావాలని నచ్చజెప్పింది. ఈ విషయాన్ని బంధువులు బాలిక తల్లిదండ్రులకు చెప్పగానే వారికి హార్ట్ ఎటాక్ వచ్చింది. గుండెపోటు నుంచి వారు కోలుకున్న తర్వాత కూడా బాలిక న్యూడ్ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేయడం కొనసాగిస్తూనే ఉన్నది. కైన్సెలర్లతో కౌన్సెలింగ్ ఇప్పించిన తర్వాత ఇప్పుడు మానేసింది.

గుజరాత్‌కు చెందిన 15ఏళ్ల బాలికను చదువుకోమని తల్లిదండ్రులు స్మార్ట్ ఫోన్ కొనిచ్చారు. ప్రత్యేకంగా రూమ్ కూడా కేటాయించారు. కానీ, ఆ బాలిక చదువుపై శ్రద్ధ పెట్టకుండా సోషల్ మీడియాపై కాన్సంట్రేషన్ పెంచింది. తెలిసీ తెలియక ఆమె ప్రైవేటు భాగాలను ఫొటోలు తీసి పోస్టు చేయడం ప్రారంభించింది. కజిన్‌నూ అలాగే చేయమని అడిగింది.

బాలిక బంధువులు ఆమె సోషల్ మీడియా పోస్టులు చూసి షాక్ అయ్యారు. ఇదే విషయాన్ని బాలిక తల్లిదండ్రులకు తెలియజెప్పారు. తల్లిదండ్రులకు ఈ వార్త వినగానే ఏకంగా గుండె పోటే వచ్చింది. తర్వాత గుండెపోటు నుంచి కోలుకున్నారు. కానీ, బాలిక తన తీరును మార్చుకోలేదు. దీంతో చేసేదేమీ లేక 181కు కాల్ చేసి నిపుణులను అలర్ట్ చేశారు. వారు బాలికకు కౌన్సెలింగ్ ఇచ్చారు. అది సైబర్ క్రైమ్ అని, అలా చేయడం చట్ట ఉల్లంఘన అని వివరించారు. కౌన్సెలింగ్ తర్వాత తాను ఫోన్‌ను కేవలం తల్లిదండ్రుల సమక్షంలోనే వినియోగిస్తానని చెప్పింది. ఆమె సోసల్ మీడియా ఖాతాలను డిలీట్ చేసింది. అంతేకాదు, ఆ ఫోన్‌ను కేవలం చదువుకోవడానికి ఉపయోగిస్తానని ప్రామిస్ చేసి చెప్పింది.

click me!