గగన్ యాన్ లో సాంకేతిక లోపం.. చివరి క్షణంలో ఆగిన ప్రయోగం..

By SumaBala Bukka  |  First Published Oct 21, 2023, 8:54 AM IST

శనివారం ఉదయం 8 గం.లకు ప్రారంభం కావాల్సిన గగన్ యాన్ ఆగిపోయింది. సాంకేతిక కారణాల వల్లే చివరి క్షణాల్లో హోల్డ్ లో పెట్టారు. 


ఇస్రో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన గగనయాన్ ప్రయోగం చివరి క్షణంలో ఆగిపోయింది. గగన్ యాన్ మిషన్ TV D1లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో చివరి క్షణంలో శాస్త్రవేత్తలు హోల్డ్ లో పెట్టారు. సాంకేతిక సమస్యను ఇస్రో శాస్త్రవేత్తలు పరిశీలిస్తున్నారు. ప్రయోగతేదీని తరువాత ప్రకటిస్తామని ఇస్రో చైర్మన్ సోమనాథ్ తెలిపారు. కౌంట్ డౌన్ ను నాలుగు సెంకడ్ల ముందు సాంకేతిక లోపంతో ప్రయోగం హోల్డ్ చేశారు. అంతకు ముందు గగన్ యాన్ పరీక్షలో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి.  

గగన్ యాన్  ప్రయోగం అరగంట లేటుగా ఈ ఉదయం 8.30కు  నిర్వహించనున్నట్లుగా ఇస్రో తెలిపింది. ఆంధ్ర ప్రదేశ్ లోని శ్రీహరికోట మొదటి లాంచ్ ప్యాడ్ నుంచి ఈ ప్రయోగం జరగనుంది.  ఇప్పటికే ఈ ప్రక్రియకు సంబంధించిన కౌంట్ డౌన్ గత రాత్రి 7:30 గంటలకు ప్రారంభమయ్యింది. 

Latest Videos

గగన్ యాన్ లో సాంకేతిక లోపం... అరగంట పాటు కౌంట్ డౌన్ పొడిగింపు..

గగన్ యాన్ కు ముందు ఇస్రో నిర్వహించనున్న నాలుగు పరీక్ష్లోల.. టెస్ట్ వెహికల్ అబార్ట్ మిషన్ మొదటిది. అదే ఇప్పుడు నిర్వహించనున్నారు. ఇంతకుముందు 2018లో ఇలాంటి పరీక్ష నిర్వహించినప్పటికీ.. అది పరిమిత స్థాయిలోనే జరిగింది. ఈసారి దాదాపుగా పూర్తిస్థాయిలో సిద్ధమైన వ్యోమనౌకను పరీక్షించనున్నారు. దీని ఫలితాల ఆధారంగా ఇస్రో తదుపరి పరీక్షలకు సిద్ధమవుతుంది. శ్రీహరికోటలో శాస్త్రవేత్తలతో సోమనాథ్ ఈ విషయం మీద చర్చిస్తున్నారు. 

 

click me!